S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కృష్ణా పుష్కరాలు విజయంతం చేయాలి

విజయపురిసౌత్, జూలై 24: మాచర్ల, గురజాల నియోజక వర్గాల్లో రూ.150 కోట్లతో పుష్కర పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని గురజాల ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం నాగార్జునసాగర్‌లోని అంతర్భాగమైన విజయపురిసౌత్‌లోని కృష్ణా నది తీరాన ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్లు, రహదారి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాచర్ల, గురజాల నియోజక వర్గాల్లో 14 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గోదావరి పుష్కరాల మాదిరిగానే కృష్ణ పుష్కరాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇమ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పుష్కర ఘాట్లు, రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా పనిచేయాలన్నారు.