పుష్కరాలకు ముస్తాబవుతున్న అమరేశ్వరాలయం
Published Monday, 25 July 2016అమరావతి, జూలై 24: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వర స్వామి దేవస్థానం కృష్ణా పుష్కరాలకు ముస్తాబవుతోంది.
హరిత వన శోభితంగా ఉండేలా ఆలయం మొదటి ప్రాకారంలో రకరకాల పూల మొక్కలతో గార్డెన్ ఏర్పాటు చేశారు. రెండో ప్రాకారంలో ఆలయం చుట్టూ కుండీల ద్వారా మొక్కలు ఏర్పాటు చేశారు. ఆలయంలో గాలిగోపురం నుండి ఆలయ ప్రవేశం వరకు గ్రానైట్ తాపడంతో ముస్తాబు చేస్తున్నారు. తిరుపతి దేవస్థానం క్యూలైన్ల మాదిరిగా ఇత్తడి కడ్డీలు, పోల్స్‌తో ప్రత్యేక క్యూలైన్లను సిద్ధం చేస్తున్నారు. ఆలయానికి దక్షిణం వైపు నిర్మిస్తున్న మహా రాజగోపురం పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. నెలాఖరులోగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేస్తామని ఆలయ అధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.