S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాంగ్రెస్ పునరుజ్జీవానికి కసరత్తు

గుంటూరు, జూలై 24: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి కసరత్తు ప్రారంభించింది. ప్రత్యేకహోదా, రైల్వేజోన్, ఇతర విభజన చట్టం అంశాల అమలుతో పాటు జిల్లాల వారీగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటు, పార్టీ సమీక్షా సమావేశాలు తరచూ నిర్వహించడం ద్వారా తిరిగి కోలుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలకు పరిశీలకులుగా సీనియర్ నేతలను పంపాలని భావిస్తోంది. గుంటూరు జిల్లాకు మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కనుమూరి బాపిరాజు, ఎపిసిసి ప్రధాన కార్యదర్శులు రాజీవ్త్రన్, ఎం వెంకట శివరామకృష్ణను నియమించింది. ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు త్వరలో జిల్లాలో పర్యటన నిర్వహించి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించనున్నారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రయివేటు బిల్లుపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. జిల్లాల్లో రాజకీయ సమీకరణలకు అనుగుణంగా భవిష్యత్తు వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి రాయపాటి సాంబశివరావు, డొక్కా మాణిక్య వరప్రసాద్ లాంటి సీనియర్ నేతలు పార్టీని వీడివెళ్లిన నేపథ్యంలో నాయకులను భర్తీచేసుకునేందుకు అనే్వషణ ప్రారంభించింది.