S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒకే ఒక్కడు హాజరు

ఖమ్మం, జూలై 24: జిల్లా సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరపడమే కాకుండా, వాటికి పరిష్కారం లభిస్తుందని ప్రజలంతా భావిస్తున్న సమావేశాలకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు గైర్హాజరవడం గమనార్హం. జిల్లా సమస్యలను, అభివృద్ధిని తెలియజేసే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగగా కేవలం భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య(సిపిఎం) మినహా మిగిలిన ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు. జిల్లాలో ఇద్దరు ఎంపిలు, నలుగురు ఎమ్మెల్సీలు, పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో పాటు రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న రేణుకాచౌదరి కూడా ఖమ్మం జిల్లా తనకు మెట్టినిల్లుగా చెప్తున్నా ప్రధాన సమావేశాలకు హాజరైన దాఖలాలు లేవు. ఆశ్చర్యకరంగా ఎక్కువ మంది ఖమ్మం జిల్లాలోనే ఉన్నప్పటికీ సమావేశానికి రాలేదు. రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న పాలేరు ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోనే ఉండి తిరుమలాయపాలెం మండలంలో పర్యటించినా జడ్పివైపు కనె్నత్తి చూడలేదు. మిగిలిన శాసనసభ్యుల్లో కొందరు ఖమ్మంలో, ఇంకొందరు వారి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇదిలా ఉండగా విద్య, వైద్య, వ్యవసాయ, హరితహారం అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఎన్నో అంశాలను చర్చించాల్సి ఉన్నా కేవలం నేతల గైర్హాజరీతో సున్నం రాజయ్య మాత్రమే ప్రశ్నల వర్షం కురిపించారు. కేవలం 5 గంటల్లోగానే సమావేశాన్ని పూర్తి అయిందనిపించారు. కాగా జిల్లాలోనే ఉన్నప్పటికీ మంత్రితో పాటు ఎంపి, ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల జిల్లా పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్య, వైద్యంపై మాట్లాడుతున్న నేతలు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని, వ్యవసాయం, హరితహారం పై చర్చించి మెరుగైన ఫలితాలు వచ్చేలా చూడవచ్చని, అయినా తమకు సంబంధం లేదన్నట్లుగా సమావేశ మందిరం ముందునుంచే వెళ్ళినా లోపలికిమాత్రం రాకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అయితే ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో ఏప్పుడూ జిల్లా పరిషత్ సమావేశాలకు రాలేదని మరో సభ్యుడు వ్యాఖ్యానించడం గమనార్హం. అందరు హాజరైతే అనేక సమస్యల పరిష్కారానికి మార్గం దొరికేదని మరో నేత అనడం విశేషం.