S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజా సమస్యలను పరిష్కరించాల

తిరుమలాయపాలెం, జూలై 24: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు యుద్ధ ప్రాతిపదికన లపరిష్కరించాని రోడ్లు, భవనాలు, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండల పరిధిలోని మర్రితండాలో ఆ గ్రామం నుండి లకావత్‌తండా ద్వారా పాతర్లపాడు వరకు 2.15కిలోమీటర్ల పొడవున 1.50కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో విద్యుత్ తీగలు వేళాడుతూ కనిపిస్తున్నాయని, దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిని అరికట్టాలని, అక్రమ విద్యుత్ వినియోగాన్ని నిలిపివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యుత్ వైర్లకు కొక్కాలు తగిలించి విద్యుత్‌ను వాడటం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని, విద్యుత్ సమస్యల్ని రెండు నెలల్లోగా పరష్కరించాలని విద్యుత్ శాఖ ఎఇ చావా లక్ష్మి, ఇతర అధికారులను ఆదేశించారు. అక్రమ విద్యుత్ వాడుతున్న వారికి మీటర్లు ఇప్పించి రెగ్యులర్ చేయించాలని, మర్రితండా ఊరుబయట ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చాలని, అక్రమ వినియోగదారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సిబ్బంది గ్రామాల్లో ఉండి వారి బాగోగులు చూసుకోవాలని, వీరన్న కుటుంబానికి నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని ఎఇ లక్ష్మణ్‌ను ఆదేశించారు. గ్రామాల్లో మంచినీటి సమస్య లేకుండా చూడాలని, పైపులైన్ నిర్మాణం గురించి సర్పంచ్ బోడా మోడుతో చర్చించి పరిష్కారం అయ్యే విధంగా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్ డిఇ పుష్పలతను ఆదేశించారు. డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ ద్వారా సాగునీటిని అందిస్తామని, చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూడాలని, మిషన్ కాకతీయ పథకం ఫేజ్-1,2 కింద మంజూరైన చెరువులను సర్వే చేసి స్ట్రేంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన తహశీల్దార్ వెంకటరెడ్డిని ఆదేశించారు. ఎంపిడిఓను పిలవగా ఆయన అందుబాటులో లేరు. సర్పంచ్ మోడుమారు గ్రామ అవసరాల గురించి మంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎఇ కృష్ణారెడ్డి, వెంకటపతిరాజు, ఏపిఎం కిరణ్‌రాయ్, ఇఓఆర్‌డి భవాని, డిఎస్పీ, సిఐ, ఎస్‌ఐలు, నాయకులు చావా వేణు, నరేష్‌రెడ్డి, మంగీలాల్, రమేష్ పాల్గొన్నారు.