S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరితహారం నిరంతర కార్యక్రమం

నేలకొండపల్లి, జూలై 24: హరితహారం ఒక్కరోజు కార్యక్రమం కాదని, ఇది నిరంతర కార్యక్రమమని, హరితహారం కార్యక్రమాన్ని జనహారంగా ప్రజలు చేపట్టాలని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నేలకొండపల్లి, నాచేపల్లి, రామచంద్రాపురం, ముఠాపురం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నేలకొండపల్లిలోని టిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు మానుకొండ దుర్గారావు ఇంటి ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం నాచేపల్లి, రామచంద్రాపురం, ముఠాపురం గ్రామాల్లో పలు సిసిరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందన్నారు. గ్రీన్ తెలంగాణను సాధించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నందిగామ కవితారాణి, జడ్పిటిసి తేజావత్ అనిత, నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, ఎంపిటిసిలు చిలకల సీతారావమ్మ, కృష్ణకుమారి, శీలం వెంకటలక్ష్మి, ఇఓఆర్‌డి ప్రభాకర్‌రావు, ఎంఇఓ పురుషోత్తమరావు, ఏపిఓ సునిత, మండల పిఆర్‌ఏఇ మలినిమోహన్, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు వెనె్నపూసల సీతారాములు, టిఆర్‌ఎస్ జిల్లా, మండల నాయకులు మానుకొండ దుర్గారావు, వేణు పాల్గొన్నారు.
కప్పలకుంట చెరువు వద్ద హరితహారం
జూలూరుపాడు: హరితహారం కార్యక్రమంలో భాగంగా జూలూరుపాడు కప్పలకుంట చెరువు వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ ముఖ్య అతిధిగా పాల్గొని మొక్కను నాటారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మదన్‌లాల్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా పాల్గొని మండలంలో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు మొక్కలను నాటాలని కోరారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ పాయం వెంకటరమణ, ఎంపిపి మూడు చిట్టిబాబు పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.