S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అదుపులోకి భూగర్భ గని పరిస్థితి

కొత్తగూడెం, జూలై 24: ప్రమాదం జరిగిన పివికె-5 ఇంక్లైన్ భూగర్భ గనిలో పరిస్థితి అదుపులోకి వస్తోంది. ఘటన జరిగి రెండు వారాలలో నిర్వహించిన నిర్విరామ కృషిఫలితంగా గని లోపల విషవాయువుల లీకేజి చాలావరకు తగ్గించగలిగారు. రెస్క్యూ సిబ్బంది గనిలోపలికి వెళ్లి శాంపిల్‌లు సేకరిస్తూ ఎప్పటికప్పుడు టెస్టింగ్‌కు పంపిస్తున్నారు. గత ఐదురోజుల నుండి కార్బన్‌డయాక్సైడ్‌ను పంపిస్తున్న అధికారులు ప్రక్రియను మరికొన్ని రోజులుకొనసాగించాలని నిర్ణయించారు. గ్యాస్‌లీకేజిని పూర్తిగా అదుపులోకి తెచ్చిన తరువాత గనిలోపల సీల్‌వాల్స్‌ను నిర్మిస్తారు. అన్ని చక్కబడటానికి మరోవారం రోజులు పట్టేఅవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) బిక్కి రమేష్‌కుమార్ పర్యవేక్షణలో జనరల్ మేనేజర్ సేఫ్టీ సుగుణాకర్‌రెడ్డి, ఏరియా జనరల్‌మేనేజర్ రమణమూర్తి, ఎస్‌ఓటుజిఎం షాలెంరాజు, అండర్‌గ్రౌండ్‌మైన్స్ ఏజెంట్ లలిత్‌కుమార్ పనులను నిర్వహిస్తున్నారు.