S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాటి నాటక రంగ అనుభవమే నేటి భుక్తికి మార్గం

ఖమ్మం(కల్చరల్), జూలై 24: ఆనాటి నాటక అనుభవమే నేటి భుక్తికి మార్గమైందని ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాదరావు వెల్లండించారు. నగరంలోని భక్తరామదాస్ కళాక్షేత్రంలో జరిగిన నెలనెలా వెనె్నల కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వచ్చిన ఆయన ఆదివారం నగరంలోని అతిధి హోటల్ నందు జరిగిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం నటనా రంగంలో అనుభవంతో పని లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో నటింపజేసి నాణ్యతలేని, జీవంలేని సినిమాలను, సీరియళ్ళను నిర్మించడం దారుణమన్నారు. కొన్ని సినిమాలు, సీరియల్స్‌లో మన సంస్కృతి, సాంప్రదాయాలను మంటగలిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ సీరియల్‌లోనూ మగాడు విలన్‌గా కనిపించే విధానమే లేకుండా పోయిందన్నారు. అయినా ఇటువంటి సీరియల్స్‌ను జనం వీక్షించడం మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతుందన్నారు. పిల్లలు ఎప్పడూ తమంతట తాము చెడిపోరని, వాళ్ళ చెడు పోకడలకు మనమే కారణమన్నారు. ఎవరికి వాళ్ళం మన ఇంట్లో సభ్యతగా నడుచుకుంటామో అదే పిల్లలకు అలవడుతుందన్నారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చే మంచి విషయాలను గాలికి వదిలి, అనవసరమైన వార్తలను పాటికి పదిసార్లు చదవడం దారుణమన్నారు. మంచి విషయాలను చదివి పిల్లలకు తెల్పడం మూలంగా వారిలో మంచిని పెంపొందించవచ్చునన్నారు. 50 సంవత్సరాలుగా నాటకాలు అడుతున్నానని, అలాగే సినిమా రంగంలో తండ్రిగా, లెక్చరర్‌గా, విలన్‌గా, వ్యాపార వేత్తగా అనేక పాత్రలు పోషించానన్నారు. నాటక రంగంలో రచన, నటన, డైరక్షన్ వంటి అన్ని రంగాల్లో మంచి గుర్తింపు లభించడమే కాకుండా అనేక అవార్డులు అందుకున్నానన్నారు. నాటక రంగం కంటే సినిమాల్లో నటించడం ఎంతో తేలికన్నారు. నాటకం ఆడాలంటే చావోరేవో తెల్చుకోవాల్సిందేనన్నారు. స్టేజీపై ఎన్ని నాటకాలు ఆడారు అనేకంటే ఎన్ని ప్రదర్శనలిచ్చారు అనడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్క్రృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు మధుసూదనరెడ్డి, అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.