S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మెనూ సక్రమంగా అమలు చేయమన్నందుకు హాస్టల్ నుంచి ఏడుగురు విద్యార్థినుల గెంటివేత

గిద్దలూరు, జూలై 24: గిద్దలూరు - నంద్యాల హైవేరోడ్డులో పాత ప్రభుత్వ వైద్యశాల సమీపంలోగల ఎస్సీ బాలికల వసతిగృహంలో మెనూ సక్రమంగా అమలు చేయించండి అన్నందుకు ఏడుగురు విద్యార్థినులను వసతిగృహ సంక్షేమాధికారి బయటకు గెంటివేసిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గిద్దలూరులోని పిఆర్‌కాలనీలోగల ప్రభుత్వ బాలసదనంలో గతంలో ఈ విద్యార్థినులు ఉంటూ విద్యను కొనసాగించేవారు. అయితే బాలసదనాన్ని 1 నుంచి 5 తరగతుల వరకే పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ ఏడుగురు విద్యార్థినులు స్థానిక సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతిగృహంలో ఈ ఏడాది చేరారు. వసతిగృహంలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని, వసతిగృహ సంక్షేమాధికారి తమ బాగోగుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆరోపిస్తూ వారు చదువుతున్న వివేకానందకాలనీలోగల సిసి స్కూల్ ప్రధానోపాధ్యాయినికి ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి విద్యార్థినులు సంక్షేమాధికారిని మెనూ గురించి ప్రశ్నించారు. ఒక బాలిక తల్లి గిద్దలూరుకు చేరుకొని వసతిగృహ సంక్షేమాధికారిని నిలదీసింది. దీంతో ఆగ్రహించిన సంక్షేమాధికారి విద్యార్థినులను హాస్టల్ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశింశారు. శనివారం రాత్రి వరకు వసతిగృహంలో ఉండేందుకు అనుమతి ఇచ్చి ఆదివారం ఉదయానే్న వెళ్ళిపోవాలని హుకుం జారీచేయగా దిక్కుతోచని విద్యార్థినులు వారు చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఇంటికి చేరుకొని తమ గోడు వెళ్ళపోసుకున్నారు. పాత్రికేయులు, హెచ్‌ఎం జిల్లా అధికారి అయిన డిడికి సమాచారం తెలిపారు. దాంతో ఆమె వసతిగృహ సంక్షేమాధికారిని తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. కాగా, ఈ విషయమై వసతిగృహ సంక్షేమాధికారిని వివరణ కోరగా, విద్యార్థినులను మందలించేందుకే హాస్టల్ నుండి వెళ్లిపొమ్మానని పేర్కొన్నారు.