S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కంట్రిబ్యూటరీ ఫెన్షన్ విధానాన్ని రద్దుచేయాలి

శ్రీకాకుళం(టౌన్), జూలై 24: అనేక సంవత్సరాల దేశవ్యాప్త పోరాటాల ఫలితంగా అమలు కాబడిన పాత ఫెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ కంట్రీబ్యూటరీ ఫెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని సిటు జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాస్ డిమాండ్ చేసారు. ఆదివారం స్థానిక ఎన్జీవో హోంలో యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లారుూస్ యూనియన్ నేతృత్వంలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2004 సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అమలులోకి వచ్చిన కంట్రిబ్యూటరీ ఫెన్షన్ విధానంతో ఉద్యోగులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. సిపియస్ విధానంలో ఉద్యోగి నెలవారీ జీతంలో 10 శాతంతో పాటు ప్రభుత్వం కలిపి పోగుచేసిన మొత్తంలో 60 శాతం మాత్రమే తిరిగి చెల్లించబడుతుందని అన్నారు. మిగిలిన 40 శాతం యాన్యుటీ పథకాల్లో పెట్టుబడులుగా వెళ్లిపోతున్నాయని, దీంతో ఆయా పథకాల్లో లాభాలు ఉంటే చెల్లింపు ఉంటుందని, లేకపోతే ఉద్యోగి నష్టపోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఆఖరికి ఉద్యోగి పదవీవిరమణ అనంతరం ఎంత ఫెన్షన్ వస్తుందన్నది గ్యారంటీ ఉండదని అన్నారు. ఉద్యోగుల డబ్బుతో మార్కెట్ జూదం ఆడే ఇటువంటి వికృత క్రీడలను ప్రభుత్వాలు రద్దుచేయాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, యుటిఎప్ జిల్లా కార్యదర్శి కిషోర్, యునైటెడ్ మెడికల్ ఎంప్లారుూస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.లక్ష్మి, పి.అప్పారావు, డి.సాయిప్రసాద్, బి.మురళి, బి.్భగ్యం, అన్నపూర్ణ, రాజేంద్ర, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.