S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆర్‌ఎంపి వైద్యులు విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి

నరసన్నపేట, జూలై 24: సమాజంలో విధి నిర్వహణలో ఆర్ ఎం పి వైద్యుల పాత్ర కీలకమైనదని అయితే విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా ఇంచార్జ్ వైద్యా ఆరోగ్య శాఖాధికారి మెండ ప్రవీణ్ తెలిపారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన జిల్లా ఆర్ ఎంపిల సంఘ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వైద్య సేవలను ఎప్పటికప్పుడు అందిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సకాలంలో వైద్యం అందించే కీలకపాత్రను ఆర్ ఎం పిలు పోషిస్తున్నారన్నారు. అయితే తప్పనిసరిగా ఆయా సేవలో ఉన్న వైద్యులు వారి సంఘంలో నమోదు చేసుకోవాలని సూ చించారు. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రభు త్వ వైద్యాధికారులను సంప్రదించాలని స్పష్టంచేశారు. అనంతరం స్థానిక ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో బీ ఎస్సీ కెమిస్ట్రీలో 8వ గ్రేడ్ సాధించిన ఐ.నర్శింహమూర్తికి ఆర్ ఎం పి సంఘం వారు అందించిన రూ.6వేల చెక్కును అందజేసి విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్‌రావు, జిల్లా అధ్యక్షులు భాస్కరరావు, ఎస్ ఎం ప్రసాద్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాములు పాల్గొన్నారు.