S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆలయాల్లో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు

విజయవాడ (క్రైం), జూలై 24: రాత్రివేళ దేవాలయాల్లో చోరీలకు పాల్పడే అంతరాష్ట్ర షికారీ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు ఐదు లక్షలు విలువైన 50గ్రాముల బంగారం, 10కేజీల వెండి 10కేజీల రాగి, ఐదువేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం కొప్పల్ గ్రామానికి చెందిన షికారి జెమిని అలియాస్ జమునా (20) అనే యువతి ప్రస్తుతం నగరంలోని వన్‌టౌన్ వినాయకుని గుడి వద్ద భర్త అంబాని, కుమారుడుతో కలిసి ఉంటోంది. వీరితోపాటు అంబాని సోదరులు రవి, చిమురు, అంబానీ స్నేహితులు విక్రమ్, ప్రసాద్‌లు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తుంటారు. నేర ప్రవృత్తి కలిగిన వీరంతా దేవాలయాలను ఎంచుకుని చోరీలకు పాల్పడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో గత ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నం ఫెర్రిలో అంకమ్మతల్లి గుడి తాళాలు పగులగొట్టి వెండి, బంగారం, నగదు చోరీ చేశారు. మార్చిలో గుంటుపల్లి శివాలయం గుడిలో తాళాలు పగులగొట్టి నగదు చోరీ చేశారు. ఈక్రమంలో మరొక నిందితుడు కర్నూలు జిల్లాకు చెందిన ప్రసాద్ (35) వీరికి పరిచయమయ్యాడు. మద్యానికి బానిసైన ప్రసాద్ గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద రోడ్లపై తిరుగుతుంటాడు. ఈక్రమంలో అంబాని ముఠాతో చేతులు కలిపి చోరీలకు పాల్పడుతూ వస్తున్నాడు. వీరంతా ఏప్రిల్‌లో ఇబ్రహీంపట్నం ఈలప్రోలు గ్రామంలో సాయిబాబాగుడి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి, రాగి నగలతోపాటు హుండీలోని నగదు దొంగిలించారు. పగలు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ గుళ్ళ చూసి రెక్కీ వేసి రాత్రులు అమలు చేస్తారు. ఇదే క్రమంలో మే నెలలో సత్యనారాయణపురం పరిధిలోని సీతన్నపేటలో దేవాలయంలో, జూన్‌లో పాయకాపురంలోని సాయిబాబా గుడిలో, అదే నెలలో గొల్లపూడిలోని ల్యాంకో కాలనీలోని మహాలక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు చోరీ చేశారు. ఆయా కేసుల్లో రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు నిందితులిద్దరిని అరెస్టు చేసి సొత్తు రికవరీ చేశారు.