S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టిడిపిలో చేరిన వైసిపి కార్పొరేటర్ లలిత

విజయవాడ (కార్పొరేషన్), జూలై 24: ఇప్పటివరకూ ఎమ్మెల్యేలకే పరిమితమైన ‘ఆపరేషన్ ఆకర్ష్’ కార్పొరేటర్ల స్థాయికి పాకింది. నగరంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన నష్టం నుంచి తేరుకోకముందే విజయవాడ నగరపాలక సంస్థలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్ వీరమాచినేని లలిత టిడిపిలో చేరడంతో విఎంసి రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొద్ది సంవత్సరాలుగా నగర రాజకీయాల్లోనే కాక సెంట్రల్ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించిన వీరమాచినేని లలిత తన భర్త కిషోర్ తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈసందర్భంగా సిఎం చంద్రబాబు వీరమాచినేని దంపతులకు టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.