S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అధికారులకు కంటిమీద కునుకు కరవు!

విజయవాడ, జూలై 24: కృష్ణా పుష్కరాలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కావటంతో వివిధ ప్రభుత్వ శాఖలు యుద్ధప్రాతిపదికన తమతమ పరిధుల్లోని పనులు పనులు చేస్తున్నారు. కలెక్టర్ బాబు ఎ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది నిబద్ధతో రాత్రి, పగలు తేడా లేకుండా 24 గంటలు పని చేస్తున్నారు.
ఇరిగేషన్ శాఖ
పుష్కర ఘాట్ల నిర్మాణ పనుల్లో ఈ శాఖ పూర్తి స్థాయిల్లో నిమగ్నమైంది. ప్రకాశం బ్యారేజీ దిగువ, ఎగుర ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల మేర పుష్కర ఘాట్ల నిర్మాణం ఈ శాఖ పర్యవేక్షణలో జరుగుతోంది. ఘాట్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. ఈ ఘాట్లలో 8 లక్షల చదరపు అడుగుల మేర టైల్స్ అతికించే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజి దగువన బ్యారేజి నుంచి పద్మావతి, కృష్ణవేణి ఘాట్లకు నీరు అందించడం కోసం 12 మీటర్ల వెడల్పుతో ఒక ప్రత్యేక అప్రోచ్ ఛానల్ నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. సుమారు 60 మంది ఇంజనీర్లు 3 షిఫ్టుల్లో 24 గంటలు పనుల పర్యవేక్షం చేస్తున్నారు.
రహదారుల భవనాల శాఖ
ఈ శాఖ ఆధ్వర్యంలో రూ. 133 కోట్ల విలువైన 35 రోడ్ల పనులను చేపట్టి పూర్తి చేయడం జరుగుతోంది. వీటిలో ప్రధానమైనది జగ్గయ్యపేట నుంచి ముత్యాలరేవు వరకు రూ. 5 కోట్లతో రోడ్లు పనులు పూర్తి చేయడం జరిగింది. ముత్యాల ఘాట్ అప్రోచ్ రోడ్డు వెడల్పును 40 మీటర్ల నుండి 110 మీటర్లకు విస్తరించడం జరిగింది.
పంచాయతీ రాజ్ శాఖ
ఈ శాఖ ద్వారా రూ. 36 కోట్ల విలువైన 121 గ్రామీణ రహదారులు చేపట్టి పూర్తి చేయడం జరిగింది. ఘాట్లకు అప్రోచ్ రోడ్లు గ్రామీణ రహదారుల రిపేర్లు వంటివి పూర్తి చేసేందుకు రూ. 18 కోట్ల ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులను వినియోగించడం జరిగింది. ఇబ్రహీంపట్నం రింగు నుండి పవిత్ర సంగమం వరకు 1.8 కి.మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మించడం జరుగుతోంది.
విద్యుత్ శాఖ
ఘాట్లకు, పుష్కర నగర్‌లకు నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు 3 ఇండోర్ సబ్ స్టేషన్లు నిర్మించడం జరిగింది. ఘాట్లలో 16 మీటర్ల ఎక్తున 150 హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 36 పుష్కర నగర్‌లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ట్రాన్స్‌పార్మర్‌లు ఏర్పాటు చేయడం జరిగింది.
గ్రామీణ తాగునీటి సదుపాయం
గ్రామీణ ప్రాంతాల్లోని ఘాట్ల నిర్వహణ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా కల్పించడం జరుగుతోంది. తాగునీటి సరఫరా కోసం మొబైల్ ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. పారిశుద్ధ్యపనులు, పుష్కరాలకు 72 గంటల ముందుగానే చేపట్టడం జరుగుతోంది.
దేవాదాయ శాఖ
జగ్గయ్యపేట నుంచి హంసలదీవి వరకు ఉన్న 216 దేవాలయాలకు రూ. 15 కోట్లతో ఆధునికీకరించడం జరుగుతోంది. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని దేవాలయాలను పుష్కరాల సందర్భంగా తెరచి ఉంచడం జరుగుతోంది. పుష్కరాలలో వివిధ పూజలు, కర్మకాండలు నిర్వహించేందుకు సుమారు 5వేల మంది పురోహితులు అందుబాటులోకి తేవడం జరిగింది. కేశఖండన కోసం వెయ్యి మంది నాయి బ్రాహ్మణులను ఏర్పాటు చేయడం జరిగింది.