S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాతావరణ మార్పులతో.. వణికిపోతున్న ఆక్వా రైతులు

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 24: వాతావరణ మార్పులు ఆక్వా రైతులను గడగడలాడిస్తున్నాయి. వారం రోజులుగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడటం, ఉక్కపోత కారణంగా ఆక్సిజన్ అందక రొయ్యలు, చేపలు మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక లీజు, పెరిగిన మేత ధరలతో సతమతమవుతున్న తరుణంలో వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, వాతావరణ మార్పులతో రొయ్యలు మృత్యువాత పడుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ఆక్సిజన్ సమస్య నుండి రొయ్యలను కాపాడుకునేందుకు లక్షలాది రూపాయలు అదనంగా ఖర్చుచేయాల్సి వస్తోందని వాపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఏరియేటర్లు తిప్పాల్సి రావటంతో ఖర్చులు తడిసిమోపెడయ్యాయని వాపోతున్నారు. నెలరోజుల్లో రొయ్యలు పట్టుబడికి వస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే అక్కడక్కడ ఆక్సిజన్ సమస్యతో రొయ్యలు మృత్యువాత పడుతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే భారీ సంఖ్యలో రొయ్యలు మృత్యువాత పడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఏదిఏమైనా వనామి రొయ్యల సాగు మాత్రం లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సిందే. అయితే వాతావరణం అనుకూలంగా ఉండి ఆక్సిజన్ సమస్య తలెత్తకపోతే వనామి రొయ్యల సాగులో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.