S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మూడు నెలల్లో గురుకులం రూపురేఖలు మారుతాయ్

సింహాచలం, జూలై 24 : అడివివరంలోని మహాత్మా జ్యోతిరావుపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల రూపురేఖలు మూడు నెలల్లో మారనున్నాయని రాష్ట్ర విద్య, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన గురుకులంలో విలేఖరులతో మాట్లాడారు. ఇటీవలే గురుకులాన్ని సందర్శించి దయనీయ పరిస్థితిని కళ్లారా చూడడం, పాఠశాల అభివృద్ధికి సంబంధించి దేవస్థానం, ఉడా, జివిఎంసి అధికారులతో పాటు కలెక్టర్‌తో చర్చించి సహకారం కోరడం జరిందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో పనులు వేగవంతమయ్యాయని ఆయన అన్నారు. రోడ్లు, కాలువలు, మరుగుదొడ్లు, ఫర్నీచర్ సదుపాయం, ప్రహారి పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. మరోమూడు నెలల్లో పనులన్ని పూర్తయ్యేల చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ విషయమై మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్యకార్యదిర్శి ప్రవీణ్ కుమార్‌లతోకూడా మాట్లాడానని మంత్రి స్పష్టం చేసారు. పాఠశాలను జూనియర్ కళాశాలగా స్థాయి పెంచే అంశమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్లు ఆయన చెప్పారు. సింహాచలం దేవస్థానం భూ సమస్యకు అతి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. అడివివరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు స్థలం కేటాయింపు, భవనాల నిర్మాణం సమస్య కూడా త్వరలోనే పరిష్కారమవుతుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
గురుకుల పాఠశాలలో సుమారు మూడు లక్షల తొంభై వేల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అయిదు కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటును మంత్రి గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్‌బాబు, అనకాపల్లి పార్లమెంటు సభ్యడు ముత్తెంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలంభవాని భాస్కర్ ప్రారంభించారు. ప్లాంటు ఏర్పాటుకు తోడ్పాటునందించిన ఎన్‌టిపిసి సంస్థను మంత్రి గంటా ఈ సందర్భంగా అభినందించారు.