S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘కాలుష్య నివారణకు మొక్కలు నాటండి’

విజయనగరం (్ఫర్టు), జూలై 24: పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు అని ఎలయన్స్‌క్లబ్ గవర్నర్ డాక్టర్ ఉప్పల వల్లి అన్నారు. పట్టణంలో వుడాకాలనీలో ఆదివారం జరిగిన మొక్కల నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వల్లి మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. మొక్కలను నాటడంతోపాటు సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. కాలుష్యం వల్ల పర్యావరణానికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రజలలో చైతన్యం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎలయన్స్‌క్లబ్ ప్రతినిధులు డాక్టర్ ఎన్‌ఆర్ విజయ, త్రిపాఠీ, పెనుమజ్జి విజయలక్ష్మి, డాక్టర్ ఎన్‌విఎస్ సూర్యనారాయణ, పిన్నింటి సూర్యనారాయణ, గోటేటి హిమబిందు పాల్గొన్నారు.