S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

నెల్లిమర్ల, జూలై 24: ప్రతి ఒక్కరు మొక్కలునాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని నెల్లిమర్ల నగర పంచాయితీ కమిషనర్ వి.అచ్చింనాయుడు కోరారు. ఆదివారం ఆయన నగర పంచాయితీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించవచ్చని అన్నారు. అలాగే వాతావరణాన్ని సమతుల్యం సాధించవచ్చని చెప్పారు. అడవుల శాతం తగ్గడంవల్ల అతివృష్టి సంభవిస్తుందని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలల్లో నాటిన మొక్కల సంరక్షణకు విద్యార్థులకు దత్తతకు ఇవ్వాలని కోరారు. ఐదువేల మొక్కలు నగర పంచాయతీలో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, కావాల్సిన వారు నగర పంచాయితీని సంప్రదించాలని కోరారు. డ్వాక్రా సంఘాలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మొక్కలు తీసుకోవడానికి ముందుకు రావాలని కోరారు.