S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవో-279 రద్దు చేయకుంటే ఆందోళన

విజయనగరం (్ఫర్టు), జూలై 24: మున్సిపల్ కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పువాటిల్లే జీవో-279ను తక్షణమే రద్దు చేయాలని ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు వి.కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ జీవోను రద్దు చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈనెల 28వ తేదీన మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. పట్టణంలో అమర్‌భవన్‌లో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల పొట్టేకొట్టే విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో-279 వల్ల మున్సిపాలిటీకి, కార్మికులకు ఎటువంటి సంబంధం ఉండదన్నారు. అందువల్ల ఈ జీవోను రద్దు చేయాలని అన్నారు. మున్సిపల్ పర్మినెంట్ కార్మికులందరికీ పిఆర్‌సి వెంటనే అమలు చేయాలని, జిపిఎఫ్ బ్యాండ్లు అందరికీ అందజేయాలన్నారు. పెరిగిన పట్టణ విస్తీర్ణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. డ్రైవర్లకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వర్క్స్ యూనియన్ అధ్యక్షుడు ఎస్.రంగరాజు, దళాయి శ్రీను పాల్గొన్నారు.