S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దయనీయంగా జూట్ కార్మికుల బతుకులు

నెల్లిమర్ల, జూలై 24: నెల్లిమర్ల జూట్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉన్న హక్కులను కోల్పోవల్సిన పరిస్థితి నెలకొంది. కార్మిక చట్ట ప్రకారం ఉద్యోగ విరమణ పొందిన వారికి యాజమాన్యం గ్రాట్యూటీ, పిఎఫ్ చెల్లింపులు చేయాల్సి ఉన్నా గత ఆరు మాసాలుగా ఉద్యోగ విరమణ పొందిన 600 మంది కార్మికులకు యాజమాన్యం మొండిచేయి చూపింది. జూట్ మిల్లులో రోజువారీ వేతనంపై పనిచేస్తున్న 1500 మంది కార్మికులు పిఎఫ్, ఇఎస్‌ఐ వంటి సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. వీరికి పని ప్రదేశంలో ఎటువంటి ప్రమాదాలు జరిగినా సొంత ఖర్చులతో వైద్యసదుపాయం పొందాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే 5 నుంచి 18 రూపాయల వరకు కార్మికుల వేతనం నుంచి విరుపుదల చేసిన పైకం ఒక్కొక్క కార్మికునికి 30వేల నుంచి 40 వేల వరకు యాజమాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగ విరమణ చేసిన చాలామంది కార్మికులు ఆ పైకం అందకుండానే కాలం చేస్తున్న దయనీయ పరిస్థితి. జూట్‌మిల్లు లీజ్ భూమిలో ఇళ్ల నిర్మాణం చేసుకుని జీవనం సాగిస్తున్న జూట్ కార్మికులు ఉద్యోగ విరమణ చేస్తే యాజమాన్యం పిఎఫ్ బకాయిలు చెల్లించకపోవడం వలన పింఛన్ నిలిచిపోతుంది. ఉద్యోగ విరమణ చేసిన తరువాత వచ్చిన పైకంతో ఆడపిల్లలకు వివాహాలు చేసుకుందామంటే యాజమాన్య చర్యలతో అవస్థలు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై రాజకీయ నాయకులు, కార్మిక శాఖ అధికారులు ప్రశ్నిస్తే జిల్లాలో జూట్ పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. మేము మిల్లు తిప్పాలా వద్ద అని యాజమాన్యం తిరిగి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కార్మిక శాఖ అధికారులు, ఎమ్మెల్యే చొరవ తీసుకుని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
గ్రాట్యూటీ బకాయిలు చెల్లించాలి:
ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు యాజమాన్యం గ్రాట్యూటీ బకాయిలు వెంటనే చెల్లించాలని జూట్ మిల్లు వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కిల్లంపల్లి రామారావు డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లింపులో యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం శోచనీయమని అంటున్నారు.