S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రజా ఉద్యమం

విజయనగరం(టౌన్), జూలై 24: జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల సాధించడంలో ప్రజలతో కలసి ఉద్యమించాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తీర్మానించారు. ఆదివారం కంటోనె్మంట్‌లోని గురజాడ పబ్లిక్ స్కూల్‌లో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాల సాధనకోసం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబ్జీ మా ట్లాడుతూ జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని తెలిపారు. రెండేళ్లల్లో ప్రభుత్వ వైద్య కళాశాల అవసరాన్ని తెలియజేస్తూ లోక్‌సత్తా పలు కార్యక్రమాలద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిందన్నారు. అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఈ విషయంలో ముందుకు రావాలని కోరారు. ప్రజలను కదిలించి ఉద్యమించేందుకు కార్యాచరణ తీసుకోవాలని రాజకీయ పార్టీలకు సూచించారు. జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎంవిఆర్ కృష్ణాజీ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయడంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరి సమంజసంగా లేదన్నారు. ఎపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సదాశివరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను కొంతమంది మంత్రులకు తాకట్టుపెట్టిందని ఆరోపించారు. వైద్య కళాశాల మంజూరు చేయకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మామిడి అప్పలనాయుడు, దళిత ఐక్యవేదిక నాయకుడు ఆదాడ మోహన్, యువజన సంఘాల అధ్యక్షుడు తిరుపతిరావు, మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాజీ పాణిగ్రాహి, వేదుల సత్యనారాయణ మాట్లాడుతూ వెనుకబడిన జిల్లా ప్రజానీకానికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని, పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి తీసుకురావాలంటే మెడికల్ కాలేజీ ఏర్పాటు ఒక్కటే శరణ్యమని చెప్పారు. వైద్య కళాశాల సాధనకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల సాధన కోసం జె ఎసిని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కన్వీనర్‌గా మామిడి అప్పలనాయుడు వ్యవహరిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుంగ భానుమూర్తి, ప్రజాల సంఘాల నాయకులు పైడితల్లి, కాంతారావు, చదలవాడ ప్రసాద్, తెరుపల్లి శ్రీను, బి. ఎల్.నర్సింగరావు, గెద్ద ప్రసాద్, శివవర్మ, శ్రీనివాస్, చిన్నారావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.