S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంబటిసత్రం-కొత్తపేట రోడ్డు పనుల్లో జాప్యం

విజయనగరం (్ఫర్టు), జూలై 24: పట్టణంలో అంబటిసత్రం జంక్షన్ నుంచి కొత్తపేట నీళ్ల ట్యాంక్‌కు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణపనులు ఒక కొలిక్కి రాలేదు. రోడ్డు నిర్మాణంలో భవనాలను కోల్పోతున్న యజమానులకు భరోసా ఇవ్వడంలో మున్సిపల్ పాలకులు నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తున్నారు. ఫలితంగా రోడ్డు నిర్మాణానికి భవనాలను కోల్పోతున్న యజమానులు అంగీకారపత్రాలను ఇవ్వడం లేదు. ఏడాదిన్నర కాలం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయినప్పటికీ మున్సిపల్ పాలకవర్గసభ్యులలో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. ఈ రహదారిలో 199 భవనాలు ఉన్నట్లు గుర్తించారు. వీరికి ప్రభుత్వపరంగా ఎటువంటి నష్టపరిహారం అందకపోయినా, భవనాలను కోల్పోయినవారికి ట్రాన్స్‌పరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్(టిడిఆర్) ఇచ్చేందుకు మున్సిపల్ అధికారులు ముందుకు వచ్చారు. ఈమేరకు నాలుగైదుసార్లు బాధితులతో మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మొదట్లో 60 అడుగుల మేరకే రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించగా, ఆ తర్వాత మారిన పరిణామాల నేపధ్యంలో తాజాగా 66 అడుగుల మేరకు విస్తరణ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందుకు భవన యజమానులు అంగీకరించడం లేదు. 66 అడుగుల మేరకు రోడ్డు విస్తరణ జరిగితే పూర్తిస్థాయిలో నిరాశ్రయులు అవుతామని వాపోతున్నారు. ఈమేరకు రెండురోజుల క్రితం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారుల ముందు తమ వాదన వినిపించారు. బాధితులకు నచ్చజేప్పి రోడ్డు నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడవల్సిన మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, ఎమ్మెల్యే మీసాల గీత పట్టించుకోకపోవడం వల్ల విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఇప్పటికే రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసింది.
విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిలో ఈ రోడ్డు ఉన్నందున ప్రతినిత్యం రద్దీగా ఉంటుంది. ఈ పరిమాణాలను ఈ రోడ్డును విస్తరించాలని స్ధానిక ఎంపి, కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు నిర్ణయించారు. అయితే రోడ్డు నిర్మాణ పనులలో విపరీతమైన జాప్యం జరుగుతుండటంతో అశోక్‌గజపతిరాజు ఆశయం ఆచరణలో నీరు గారుతోంది. పట్టణంలో విస్తరణ, అభివృద్ధి చేయాలని నిర్ణయించిన మిగతా రోడ్లు పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం దృష్టి సారించి రోడ్డు నిర్మాణపనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.