S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇవీ అపురూపమే..

ఎంచుకున్న రంగంలో ఒకస్థాయి దాటివెళ్లిన సెలబ్రిటీల గురించి ఏ సమాచారం తెలిసినా అభిమానులకు ఒకింత అపురూపంగానే ఉంటుంది. అదే సనిమా రంగంలో అయితే, ఆ ఆర్థ్రత ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు. ఒక్కోసారి అభిమాన నటుడో, నటో రొటీన్ లైఫ్‌లో ఏం చేస్తుంటుంది, వాళ్ల ఇష్టాయిష్టాలు, లేదూ సినియేతర చిత్రాలు, వాళ్లు వాడిన వస్తువులు, నివాసమున్న ప్రదేశాలు.. ఇలా చిన్న చిన్న అంశాలు కూడా అభిమానుల కంటికి గొప్పగాను, మనసుకు అపురూపంగానూ అనిపించక మానదు.
తెలుగు సినిమారంగంలో ఉద్దండులు అనిపించుకుని, భౌతికంగా మన మధ్య లేకపోయినా, చిరస్మరణీయ కృషిని మనకు అందించి వెళ్లిపోయిన కొందరి విజిటింగ్ కార్డులు ఇవిగో ఇక్కడ. వృత్తిపరంగానూ, వ్యాపారపరంగానో ఈ విజిటింగ్ కార్డులు వాళ్లకు సర్వసాధారణమే కావొచ్చు. కానీ, అభిమానులకు ఇవీ అపురూపమే.
సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి తెలుగు, తమిళ, హిందీసహా మొత్తం 14 భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించి రికార్డు సృష్టించిన వ్యక్తి డి రామానాయుడు. హైదరాబాద్, విశాఖపట్నంలో సినిమా స్టూడియోలు నిర్మించి తెలుగు పరిశ్రమ విస్తరణకు, బలమైన పునాధులు వేళ్లూనుకోవడానికి కృషి చేసిన వ్యక్తి రామానాయుడు.
ఇక సిరిసిరిమువ్వ, స్వాతిముత్యం, శంకరాభరణం, సాగరసంగమం వంటి కళాత్మక చిత్రాలను తెలుగు పరిశ్రమకు అందించిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, పల్లెటూరిపిల్ల, చెంచులక్ష్మి, భీష్మ తదితర సూపర్ హిట్ చిత్రాల నిర్మాత, దర్శకుడు బిఏ సుబ్బారావు, ఒకే చిత్రం ప్రతిజ్ఞతో పరిచయమై, తర్వాత అదే ధోరణిలో ఒకరు హీరోగా మరొకరు విలన్ పాత్రల్లో పలు విజయాలు సాధించిన కాంతారావు, రాజనాల, రోజులుమారాయి చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసి, తర్వాత అనుపమ ఫిలింస్ నిర్మాణ సంస్థ ప్రారంభించి పలు విజయవంతమైన చిత్రాలను అందించిన కెబితిలక్, అలాగే ఆదుర్తి సుబ్బారావు చిత్రాల్లో అధిక భాగం చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన అనుభవంతో దర్శకుడిగా మారి అపాయంలో ఉపాయం, ఖైదీబాబాయి, మంచి బాబాయి చిత్రాలకు దర్శకత్వం వహించిన టి.కృష్ణ, నాటక రంగంలో అపార అనుభవం గడించి సినిమాల్లోకి వచ్చాక తెలంగాణ శకుంతలగా పేరు తెచ్చుకున్న శకుంతల, నాటకరంగ అనుభవంతో పరిశ్రమకు వచ్చి ‘నీడలేని ఆడది’ చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయమై, బామ్మమాట బంగారుబాట చిత్రం షూటింగ్‌లో గాయపడి వికలాంగుడిగా మారిన నూతన్‌ప్రసాద్, తెలుగు సినిమా గీతానికి రసగుళికల్లాంటి బాణీలు అందించిన సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుల విజిటింగ్ కార్డులు ఇవి. తెలుగు పరిశ్రమకు తమవంతు కృషి చేసిన వెళ్లిపోయిన మహానుభావులను గుర్తు చేసే చిగురు కాగితాలు -ఈ విజిటింగ్ కార్డులు.

-శరత్‌కుమార్