S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమాయక రైతులపై లాఠీ చార్జి చేయడం అప్రజాస్వామికం

మంచిర్యాల, జూలై 25: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్న అమాయక రైతులపై లాఠీచార్జ్జీ చేయడం అప్రజాస్వామికమని తూర్పు జిల్లా జెఎసి కన్వీనర్ గోనె శ్యాంసుందర్ రావు అన్నారు. సోమవారం జెఎసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమాయక రైతులపై ప్రభుత్వం లాఠీ చార్జి చేయగా, పరామర్శించేందుకు వెళ్లిన జెఎసి చైర్మన్ కోదండరాం, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గురిజాల రవీందర్, పిట్టల రవీందర్‌లను అరెస్టు చేయడం ప్రభుత్వ నియంత పాలనకు నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామిక దేశంలో ప్రజలు తమ బాగోగుల గూర్చి గళం విప్పితే నియంతపాలన కొనసాగిస్తున్న తెరాస ప్రభుత్వం రైతులు, ప్రజలపై దాడిచేయడమే కాక నాయకులను అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాల్సిఉండగా, బెదిరింపులకు పాల్పడుతూ ఈ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. మల్లన్న సాగర్ వద్దు అంటూ ఇంజినీరింగ్ నిపుణులే చెబుతుంటూ ప్రభుత్వం తన మొండి వైఖరి వహిస్తూ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంటుందన్నారు. గాయపడిన ప్రజలను పరామర్శించడానికి, మెదక్ జిల్లా బంద్ విజయవంతం చేయాలని ప్రజలకు నైతిక మద్దతు తెలిపిన రాజకీయ జెఎసి నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే అరెస్టు చేసిన నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జెఎసి మంచిర్యాల కన్వీనర్ బాపన్న, కో-కన్వీనర్ జాఫర్, నాయకులు జయరాజ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.