S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మల్లన్నసాగర్ లాఠీచార్జిపై నిరసన వెల్లువ

ఆదిలాబాద్, జూలై 25: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, దీనిపై అందోళనకు దిగిన రైతులపై లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీల అధ్వర్యంలోనిరసనలు మిన్నంటాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్‌నగర్ డివిజన్‌లలో ప్రభుత్వ నియంతృత్వ విధానాలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకో, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి అధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో రాస్తారోకో నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ నోట్లో మద్యం పోస్తూ దగ్దం చేశారు. ఈ సంధర్భంగా మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుటుంబం అవినీతి సొమ్ముతో ఆస్తులు కూడ బెట్టుకునేందుకే సాగునీటి ప్రాజెక్టుల పేరిట రైతుల భూములను బలవంతంగా లాక్కొంటుందని అన్నారు. చట్టబద్దంగా జీవో ప్రకారం నష్టపరిహారం, పునరావాసం కల్పించి, వారి సమ్మతి మేరకే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించాల్సి ఉండగా మంత్రి హరీష్‌రావు ఏకపక్షంగా రైతులను రెచ్చగొడుతు భూనిర్వాసితులపై లాఠీచార్జి చేయడం సిగ్గుచేటయిన విషయమని అన్నారు. రైతుల ఉసురు తగలడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన 2013 చట్టం ప్రకారమే భూములకు పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు సాగునీరందించడం కలగానే మిగులుతుందని, రైతుల నోట్లో మట్టికొడితే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీ అమలుకాక బాధితులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ పేరిట టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని, మల్లన్న సాగర్ నిర్వాసితులపై లాఠీచార్జి చేయడమే గాక వారిని పరామర్శించేందుకు వెళ్ళిన జె ఏసి చైర్మెన్ కోదండరాం, ప్రతిపక్ష నేతలను అరెస్టుచేయడం శోచనీయమని అన్నారు ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోకుంటే జిల్లా వ్యాప్తంగా అందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షాబీర్, సాజిద్‌ఖాన్, మునిగెల నర్సింహులు, ఆశోక్, అజయ్, భూమారెడ్డి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం రాస్తారోకో
మల్లన్న సాగర్ భూనిర్వాసితులపై లాఠీచార్జి, ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఆదిలాబాద్ బస్టాండ్ రహదారిపై సిపి ఎం అధ్వర్యంలోరాస్తారోకో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి మాట్లాడుతూ ప్రజల గొంతు నొక్కుతూ ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం శోచనీయమని అన్నారు. మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయని, గ్రామస్తుల అభిప్రాయం మేరకే ప్రాజెక్టులు కట్టాలని డిమాండ్ చేశారు. కాకతీయ మిషన్‌లో జరిగిన అవినీతి అక్రమాలను కూడా బయటకు తీయాలని డిమాండ్ చేశారు.