S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పోలీసుల అండతో ఉద్యమాలను ఆపలేరు

కరీంనగర్ టౌన్, జూలై 25: మెట్ట ప్రాంతంలో నిర్మిస్తున్న గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న నిర్వాసితుల కోసం ఎంతకైనా తెగిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ స్పష్టంచేశారు. ఆయా గ్రామాల ప్రజలతో పాటు భూనిర్వాసితులు సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల అండతో ప్రజా ఉద్యమాలనాపలేరని, ప్రతిపక్షాల గొంతునొక్కుతూ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. భూ యజమానుల ఇష్టానుసారమే అనుసరించాల్సిన విధివిధానాలకు మంగళం పాడిన పాలకులు నామమాత్రపు పరిహారం చెల్లించి భూములు లాక్కునేయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిని ప్రశ్నిస్తే ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పుతూ లాఠీచార్జీలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. నాటి నైజాం పాలననే ఎదిరించి, తోకతెంచిన అనుభవం ఉద్యమపార్టీగా సిపిఐకి ఉందని, అనుభవరాహిత్యంతో పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ తీరును అడ్డుకుని, తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. 123జీవోను రద్దుచేసి, తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లిస్తూ, ప్రాజెక్టుల ఎత్తు పెంపు ప్రతిపాదనలను విరమించుకోవాలంటూ, దీనిపై కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలంటూ ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. అధికారులెవరూ రాకపోవటంతో తామే లోనికి చొచ్చుకువెళ్ళేందుకు యత్నించటంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ముట్టడిలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, నాయకులు కోహెడ సృజన్‌కుమార్, బూడిద సదాశివ, పైడిపల్లి రాజు పాల్గొన్నారు.