S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం కెసిఆర్ అవివేకం

కాల్వశ్రీరాంపూర్, జూలై 25: ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం కెసిఆర్ అవివేకమని బిజెపి జాతీయ నాయకుడు చందుపట్ల జంగారెడ్డి అన్నారు. ఆయన మండల కేంద్రంలో సోమవారం మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపితే పార్టీని విలీనం చేస్తానని, బిల్లు ఆమోదం వచ్చాక సోనియా గాంధీని కెసిఆర్ మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని, కెసిఆర్ కొడుకు, కూతురు, అల్లుడే రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా చెలామణి అవుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు అధికారులను బెదిరింపులకు గురిచేస్తూ ప్రతి పనుల్లో కాంట్రాక్ట్ దారులుగా బినామీలను నియమిస్తున్నారన్నారు. పేద ప్రజలను కాపాడేందుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తే వాటిని వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనుకునే కెసిఆర్ ఆశ కళగానే మిగిలిపోతుందన్నారు. ఈ సమావేశంలో కాసర్ల తిరుపతి రెడ్డి, కామిడి పద్మాకర్ రెడ్డి, చల్ల చంద్రవౌళి, కాలువ రాధాకృష్ణా రెడ్డి, కుమార్, అనీల్, అచిత్, మహేందర్ రెడ్డి, అనీల్ ఉన్నారు.