S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డబుల్ బెడ్ రూం ఇళ్ళ ప్రక్రియ వేగవంతం చేయాలి

కరీంనగర్ టౌన్, జూలై 25: జిల్లాలో చేపట్టాల్సిన రెండు పడక గదుల ఇళ్ళ పథకం ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె అధికారులతో డబుల్ బెడ్‌రూం ఇళ్ళపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 467, పట్టణ ప్రాంతాలలో 2380 మొత్తం 6947 ఇళ్ళు మంజూరు కాగా, పరిపాలనా అనుమతులు ఇప్పటికే ఇవ్వడం జరిగిందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 93,435 దరఖాస్తులు రాగా, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలో3310, పట్టణ ప్రాంతాల్లో 240 మంది లబ్దిదారులను ఎంపిక చేసినట్లు, 169 స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. స్థలాల వారీగా టెండర్లను పిలవాలని త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలని అన్నారు. గుర్తించిన స్థలాల లేఅవుట్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలన్నారు. సమస్యలుంటే వెంటనే పరిష్కరించుకోవాలని, ఉద్యోగుల ఆవశ్యకత ఉంటే అవుట్‌సోర్సింగ్ ద్వారా నియమించుకునేందుకు అనుమతిస్తామన్నారు. రెండు పడక గదుల పథకాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ కార్యక్రమం జిల్లాలో మందకొడిగా కొనసాగుతుందని పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పిడి నర్సింహారావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ పింగళి సతీష్, మిషన్ భగీరథ ఎస్‌ఇ శ్రీనివాసరావు, టౌన్ ప్లానింగ్ అధికారి వెంకన్న పాల్గొన్నారు.