S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలు నింపాలి

కరీంనగర్, జూలై 25: ఎస్సారెస్పీ ఉప కాలువలతో పాటు ఆయకట్టు ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపేందుకు వీలుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలు నింపాలని, రుణమాఫీ రైతులకు పూర్తిస్థాయిలో అమలుచేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశించిన స్థాయిలో వర్షాలు పడక రైతులు బెంబేలెత్తిపోతున్నారని, మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గేట్లు ఎత్తివేయడం వల్ల 21 టిఎంసిల నీరు ఎస్సారెస్పీ లోకి వచ్చి చేరిందన్నారు. ఎస్సారెస్పీలో నీటిమట్టం పెరిగినందున డి-83, డి-84, డి-86 కాలువలకు నీరు విడుదల చేయాలని, అలాగే ఆయకట్టు ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నీటితో నింపాలని ఆయన డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా ఎస్సారెస్పీ నీటి విడుదలపై జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయం ప్రకటించకపోతే ఆమరణ దీక్షకు పూనుకుంటానని ఆయన హెచ్చరించారు. చెరువుల్లో బావుల్లో నీరు లేక రైతులు సాగుపై ఆశలు వదులుకొనే పరిస్థితులు ఉన్నాయని, బోరింగులు, చేద బావులు ఎండిపోయి ప్రజలు తాగునీటికి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి జిల్లాలో కరవు విలయతాండవం చేస్తుందని కరవు నివారణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విజయరమణారావు ఆరోపించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో నాయకులు అన్నమనేని నర్సింగరావు, గంట రాములు యాదవ్, కళ్యాడపు ఆగయ్య, చల్లోజు రాజు, పుట్ట నరేందర్, రాధిక, అనసూర్యనాయక్, వాణి, ఈశ్వరి పాల్గొన్నారు.