S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

జమ్మికుంట, జూలై 25: నగర పంచాయతీ పరిధిలోని ఆబాది జమ్మికుంట సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జమ్మికుంట క్రిష్ణకాలనికి చెందిన జిక్కిడి క్రాంతికుమార్ (24), గొట్టిముక్కుల శ్రీనివాస్ (22)లు దుర్మరణం పాలయ్యారు. వీణవంక వైపు నుండి జమ్మికుంటకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్టు భావిస్తున్నారు. అయితే ఇద్దరికి తలలు నుజ్జు నుజ్జు అవడం, ద్విచక్ర వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమై పోవడాన్ని బట్టి బైకుపై వస్తున్న క్రాంతి, శ్రీనివాస్‌లు రోడ్డుపై ఆగిన వాహనాన్ని గమనించక ఢీకొట్టారా అనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. రాత్రి 11గంటల ప్రాంతంలో ఘటన జరుగగా అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వారిని 108 వాహనంలో స్థానిక సివిల్ ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మృతుడు క్రాంతి తల్లిదండ్రులు 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శ్రీనివాస్‌ది శంకరపట్నం మండలం కన్నాపూర్ కాగ స్థానికంగా ఓ పాల వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తూ క్రాంతి ఇంట్లోనే అద్దెకుంటున్నాడు. క్రాంతికి రెండేళ్ల క్రితం వివాహమైంది. కాగా శ్రీనివాస్ అవివాహితుడు. సోమవారం జమ్మికుంట సిఐ పింగిళి ప్రశాంత్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.