S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లా మంత్రులు జీవచ్ఛవాలు

మహబూబ్‌నగర్, జూలై 25: జిల్లా మంత్రులు జీవచ్ఛవాలు అయ్యారని వారికి పరిపాలన విధానమే తెలియదని వారి శాఖల్లో ఏమి జరుగుతుందో తెలియకుండా పోయిన అసమర్థులని వీరి కారణంగా జిల్లా నాశనం అవుతుందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాగం మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రులు అవగాహన లోపం కారణంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని పాలమూరు ఎత్తిపోతల పథకంలో 18 ప్యాకేజీలకుగాను తాను కేవలం నాలుగు ప్యాకేజీల్లో మాత్రమే అవినీతి చోటు చేసుకుంటుందని, అక్రమాలు జరుగుతున్నాయని లేవనెత్తానని తెలిపారు. దీంతో నాగం జనార్థన్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్న మంత్రులు అవగాహన లేని వారిగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. నేను ఏమీ పాం చేశానని...జిల్లాకు ఎంతో చేశానని నేను ప్రాజెక్టులను అడ్డుకోవడం అంటే జిల్లా ప్రజలు ఎవరు మంత్రులను క్షమించరని హెచ్చరించారు. ప్రాజెక్టులలో కోట్లాది రుపాయల అవినీతి జరుగుతుంటే చేతులు కట్టుకుని కూర్చోవాలా అంటూ నాగం ప్రశ్నించారు. ఎవరేవరిని ఎక్కడెక్కడ లాగాలో కోర్టు చూసుకుంటుందని మరికొన్ని రోజుల తర్వాత ఎవరిది నిజమో తెలుతుందన్నారు. తాను తెలంగాణ వ్యతిరేకినని దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని ఏడాదిన్నర పాటు 1969లోనే తెలంగాణ కోసం జైలు జీవితం గడిపానని తన నిజాయితీని శంఖిస్తున్నవారు ముర్ఖులన్నారు. పెళ్లి కార్డులోనే జై తెలంగాణ ముద్రించుకున్న తెలంగాణవాదినని ఆయన తెలిపారు. అసలు సిసలైన తెలంగాణ బిడ్డను తాను అని, ముఖ్యమంత్రికి దమ్ముధైర్యం ఉంటే పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. పరీక్షలు చేస్తే ఎవరి జీన్స్ నిజమైందో తేటతెల్లం అవుతుందన్నారు. జిల్లా మంత్రులను తాను హెచ్చరిస్తున్నానని తనతో పేచికి దిగితే మీ బండారాలన్నీ బయటపెడతానని అందరి జాతకాలు నాదగ్గర ఉన్నాయని తస్మాత్ జాగ్రత్తగా ఉంటే మంచిదని హితవు పలికారు. తాను చేసేదంతా జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం సజావుగా త్వరితగతిన రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రజాధనం లూఠీకాకుండా అవినీతికి అస్కారం లేకుండా కొనసాగాలన్నదే తన తాపత్రయం అన్నారు. త్వరలోనే బిజెపి ఆధ్వర్యంలో ప్రాజెక్టులను సందర్శిస్తామని, మెదక్ రైతులపై రాష్ట్ర ప్రభుత్వం దమనఖండకు దిగడం హేయమైన చర్య అన్నారు. కోదండరాంతో పాటు బిజెపి, టిడిపి, ఇతర పార్టీల నాయకులను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరెస్టు చేయించడం దుర్మార్గమైన పద్ధతి అన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు ముందుగా మానుకుని తానుకూడా ఒక డాక్టర్‌గా సలహా ఇస్తున్నానని ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని హితవు పలికారు. వైద్య ఆరోగ్యశాఖకు పట్టిన వైరస్‌ను తొలగించాలని ముందు నీ శాఖలో పనితీరును మెరుగుపర్చుకుని ఇతరులపై ఆరోపణలు చేస్తే బాగుంటుందని నీ నియోజకవర్గంలో కూడా నీతో పాటు నీ అనుచరులు ఏ ఏ దందాలు చేస్తున్నారో అన్ని తనదగ్గర ఉన్నాయని సమయం వచ్చినప్పుడు బయటపెడితే నీ నిజస్వరూపం బయటపడుతుందని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో బిజెపి నాయకులు రామచంద్రయ్య, అంజయ్య, అర్థం రవి, యాదయ్య, నాగరాజు, వినయ్‌కుమార్, రాజేందర్‌రెడ్డి, బుడ్డన్న తదితరులు పాల్గొన్నారు.