S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు

నాగర్‌కర్నూల్, జూలై 25: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాబోయే రోజులలో బజారున పడతామనే భయంతోనే ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీటి ప్రాజెక్టుల విషయంలో స్పష్టమైన వైఖరి లేని ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇపిసి పద్ధతిలో గత ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇపిసి పద్ధతిని పూర్తిగా రద్దు చేసి ఏజెన్సీలకు ఇవ్వాల్సిన డబ్బులను చెల్లించి కొత్తగా ఒప్పందాలు చేసుకొని చేపట్టిన ప్రాజెక్టుల పనులను సత్వరంగా పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త పద్ధతిలో జిల్లాలోని కెఎల్‌ఐ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, సంగంబండ తదితర ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. జూరాలకు వచ్చిన వరద జలాలతో కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా ప్రారంభించామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో 30 టిఎంసిల నీటి కోసం 30 గ్రామాలు మునిగిపోతుండగా 50 టిఎంసిల మల్లన్నసాగర్‌లో మూడు గ్రామాలే మునుగుతున్నాయని, ముంపునకు గురవుతున్న వారికి దేశంలోనే మెరుగైన పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. 2013 చట్టం ప్రకారం, 123 జీవో ప్రకారం నిర్వాసితులు ఏది కోరితే దాని ప్రకారం పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించగా ముంపునకు గురవుతున్న ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని తెలిపారు.
కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం
వచ్చే నెలలో జరిగే కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వచ్చిన గోదావరి పుష్కరాలను ఐదు జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. అదే స్ఫూర్తితో కృష్ణాపుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలకు సమృద్ధిగా నిధులు ఇచ్చామని తెలిపారు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో జరిగే పుష్కరాలకు సంబంధించిన ఘాట్లు, మరుగుదొడ్లు, రోడ్లు, ఇతర నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ నెలాఖరు వరకు పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, టిఆర్‌ఎస్ నేత రఘునందన్‌రెడ్డి పాల్గొన్నారు.