S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరితహారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం: మంత్రులు తుమ్మల, జూపల్లి

వనపర్తి, జూలై 25: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, పంచాయతి రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు అన్నారు. సోమవారం వనపర్తి డివిజన్ వీపనగండ్ల మండల పరిధిలోని గోవర్ధనగిరి, పెద్దదగడ, చిన్నంబావిలలో హరితహారంలో పాల్గొని వారు మొక్కలు నాటారు. అనంతరం కొప్పునూరు గ్రామంలో రోడ్డుకు అనుకొని మొక్కలు నాటడాన్ని చూసిన మంత్రులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ అండ్‌బి, పంచాయతి రాజ్ రోడ్ల వెంట నాటే సందర్భాల్లో వెడల్పుగా నాటాలని, రోడ్డుకు అనుకొని నాటితే రోడ్డు వెడల్పు సందర్భంల్లో మొక్కలను తీసి వేయాల్సి వస్తుందని వారు అన్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వీటిని చూసుకోవాలని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయవద్దని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ బండారి భాస్కర్, ఎంపిడి ఓ ఆంజనేయులు, తహశీల్ధార్ ప్రభాకర్ రావు, ఎంపిపి లావణ్య, జడ్పిటిసి లోకారెడ్డి, కొల్లాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.