S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జూరాలకు 15వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

గద్వాల, జూలై 25: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 15వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.47 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 15వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు జూరాల నుంచి 11,616 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల జలాశయంలో 9.562 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఆల్మట్టి జలాశయంలో 519.60 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 23,336 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 25వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఆల్మట్టి జలాశయంలో 123.081 టిఎంసిల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ జలాశయంలో 491.840 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 23,600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా అక్కడ విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 23,310 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం నారాయణపూర్ జలాశయంలో 31.317 టిఎంసిల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఒక యూనిట్‌లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి...
ప్రియదర్శిని జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని 8వేల క్యూసెక్కుల ద్వారా ఒక యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. అదేవిధంగా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 1500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువలకు 800 క్యూసెక్కులు, పైలాన్ కాలువకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల అధికారులు తెలిపారు.