S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాకినాడకు కొత్త హోదా

కాకినాడ, జూలై 25: ఆకర్షణీయ నగరంగా ఎంపికై ఏడాది పూర్తిచేసుకున్న కాకినాడ నగరం త్వరలో ‘స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్’గా అప్‌గ్రేడ్ కానున్నది. దీంతో కాకినాడ నగరానికి ప్రత్యేకాధికారులు నియమితులు కానున్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని కీలక పోస్టులను కూడా మంజూరుచేసింది. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటుచేసిన వెంటనే ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఒ) ని నియమించనున్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ వంటి పోస్టులు భర్తీచేయనున్నారు. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవల్సిందిగా మున్సిపల్ పరిపాలన, అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కర్కల్ వల్లభన్ సోమవారం కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్‌కు సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీలను ఏర్పాటుచేయాలని స్పష్టంచేశారు. కాకినాడ స్మార్ట్‌సిటీకి ప్రస్తుతం కలెక్టర్ ఛైర్మన్‌గాను, నగర పాలక సంస్థ కమీషనర్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు జూలై నెలాఖరుకు కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి, కొత్త పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ ఎంపికకు ఏడు కంపెనీలు దాఖలు చేసిన టెండర్లను ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం పరిశీలిస్తోంది.
స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్ క్రింద ఏడాదికి 200 కోట్ల వంతున ఐదేళ్ళలో వెయ్యి కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. 2015 జూన్ 25న స్మార్ట్‌సిటీగా కాకినాడ ఎంపికైన నాటి నుండి ఇంతవరకు 186 కోట్లు లభించాయి.
కాగా ఆరు సంవత్సరాల క్రితం కాకినాడ నగర పాలక సంస్థ పాలక వర్గం పదవీ కాలం ముగిసింది. అప్పటి నుండి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించలేదు. ఆరేళ్లుగా ప్రత్యేకాధికారుల (కలెక్టర్) పాలనలోనే కార్పొరేషన్ కొనసాగుతోంది.