S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆది నుంచి అక్రమ నిర్మాణమే!

హైదరాబాద్, జూలై 25: జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌క్లబ్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆలస్యంగా స్పందించిన జిహెచ్‌ఎంసి అధికారులు ఎప్పటిలాగానే ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. సర్కిల్ 10బి అసిస్టెంటు సిటీ ప్లానర్ శేఖర్‌రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ మల్లేశ్వర్ కళ్ల ముందే అక్రమ నిర్మాణం జరుగుతున్నా, దాన్ని ప్రాథమిక దశలోనే అడ్డుకోవటంలో విఫలమయ్యారని కమిషనర్ డా.బి.జనార్ధన్ రెడ్డి తెలిపారు. సోమవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిల్మ్‌క్లబ్ భవనానికి, అలాగే కొత్తగా నిర్మిస్తున్న పోర్టికోకు అనుమతి లేదని ఆయన వెల్లడించారు. గడిచిన ఇరవై ఏళ్లుగా ఈ భవన నిర్వాహకులు నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ వస్తున్నారన్నారు. 1996 జనవరి మాసంలో జి ప్లస్ రెండు అంతస్తుల కోసం అప్పట్లో దరఖాస్తులు చేసుకున్నారని, కార్పొరేషన్ ఇచ్చిన అనుమతిని అతిక్రమించి జి ప్లస్ మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించారని వివరించారు. అంతేగాక, నిర్మించాలనుకున్న ఏరియాను 6100 చదరపు మీటర్లకు విస్తరించి నిర్మించి, భవన నిర్మాణ నియమావళిని ఉల్లంఘించినట్లు గుర్తించామన్నారు. ఆ తర్వాత ఈ భవనం క్రమబద్ధీకరణ కోసం 2008లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం కింద యజమాన్యం దరఖాస్తు పెట్టుకుంది. కానీ ఈ భవనానికి ఫైర్ ఎన్వోసి లేకపోవటం, క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన జరిమానా చెల్లించకపోవటం వల్ల ఆ భవనాన్ని క్రమబద్ధీకరించకుండా దరఖాస్తును తిరస్కరించామని ఆయన తెలిపారు. ఆ తర్వాత 2014 సెప్టెంబర్‌లో మెయిన్ కాంప్లెక్సు నిర్మాణాన్ని కూడా అక్రమంగానే చేపట్టారని వివరించారు. దీన్ని అప్పట్లో ప్రాథమిక స్థాయిలో ఉన్నపుడే అధికారులు గుర్తించి పనులు నిలిపివేసి, షోకాజ్ నోటీసులు జారీ చేశారన్నారు. దీంతో క్లబ్ యాజమాన్యం కోర్టుకెళ్లి, ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు జిహెచ్‌ఎంసి కూడా కోర్టులో అఫిడవిట్ జారీ చేసినట్లు కమిషనర్ తెలిపారు.
అవసరమైతే క్రిమినల్ చర్యలు
ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయేందుకు మరికొందరు ఆసుపత్రిపాలయ్యేందుకు కారకులైన క్లబ్ యాజమాన్యం, కాంట్రాక్టర్లపై ఇప్పటికే పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయగా, అవసరమైతే ప్రస్తుతం సస్పెన్షన్‌కు గురైన ఇద్దరు టౌన్‌ప్లానింగ్ అధికారులపై కూడా క్రిమినల్ చర్యలు తప్పవని కమిషనర్ చెప్పారు.
కెటిఆర్ ఆగ్రహం
ఫిలింనగర్ ఘటనపై మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌పైన, ఇంజనీర్, నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌లపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కెటిఆర్ అధికారులను ఆదేశించారు. సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెన్షన్‌కు ఆదేశాలు జారీ చేశారు.