S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హైదరాబాద్‌కు సంకీర్త్ మృతదేహం

హైదరాబాద్ / కాచిగూడ, జూలై 25: అమెరికాలో స్నేహితుడి చేతిలో హతమైన హైదరాబాద్‌కు చెందిన సంకీర్త్ మృతదేహం తన నివాసానికి సోమవారం చేరుకుంది. సంకీర్త్ ఇటీవల అమెరికాలో తన స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మెడిసిన్ పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని అమెరికాలోనే స్థిరపడ్డ తమ కుమారుడు హత్యకు గురికావటం అతని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంకీర్త్ హత్యకు గురైన నాటి నేటి వరకు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. దీంతో సుల్తాన్‌బజార్ కుత్భీగూడలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ వైద్యశాఖలోని పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న విజయ్‌కుమార్, రమాదేవి దంపతుల కుమారుడు సంకీర్త్. ఎంఎస్ పూర్తి చేసిన సంకీర్త్ రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి టెక్సాస్ నగరంలోని ఆస్టిన్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో సంకీర్త్ ఈనెల 18వ తేదీన (గత సోమవారం) తన గదిలోనే దారుణ హత్యకు గురయిన విషయం విదితమే. అమెరికా ప్రభుత్వ ఉద్యోగిగా మంచి పేరు సంపాదించుకున్న సంకీర్త్‌కు నెల రోజుల క్రితం అక్కడి ప్రభుత్వం హెచ్‌ఎన్-1 వీసా కూడా జారీ చేశారని, మరో వీసా లక్కిడీప్ ద్వారా పొందినట్టు సంకీర్త్ కుటుంబ సభ్యులు తెలిపారు. ‘నిందితుడు సందీప్, సంకీర్త్ గదిలో ఉంటాడని తెలుసుకొని తమ కొడుకుకు మంచి స్నేహితుడు దొరికాడని అండగా ఉంటాడని అనుకున్నాం, కానీ హత్య చేస్తాడని, తమ ఇంటికి ఇలా సంకీర్త్ శవమై వస్తాడని అనుకోలేదని’ తల్లిదండ్రులు కంటతడిపెట్టారు. తన కొడుకు హంతకుడిని కఠినంగా శిక్షించాలని, మృతదేహాన్ని భారత్‌కు పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. సంకీర్త్ పార్థివ దేహం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి కాచిగూడలోని తన నివాసానికి సోమవారం తెల్లావారుజామున చేరుకుంది. అనంతరం మృతదేహన్ని అంత్యక్రియల నిమిత్తం కాచిగూడలోని హరాస్‌పేట్‌లోని హందు స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

చిత్రాలు.. రోదిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు, హైదరాబాద్‌కు చేరిన సంకీర్త మృతదేహం