S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లాఠీచార్జ్జిపై భగ్గుమన్న విపక్షాలు

నల్లగొండ, జూలై 25: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులపై ప్రభుత్వం లాఠీచార్జి చేసి కాల్పులతో బెదిరించడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించి సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, హుజూర్‌నగర్, దేవరకొండ, నకిరేకల్, మోత్కూర్, ఆలేరు, చిట్యాల, వలిగొండ, చౌటుప్పల్, రామన్నపేట, మునుగోడు తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు, సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి. జిల్లా కేంద్రం నల్లగొండలో సిపిఎం, న్యూడెమోక్రసీలు నిరసన ప్రదర్శన నిర్వహించి సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, న్యూడెమోక్రసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరి సాగర్, జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్‌కుమార్‌లు మాట్లాడుతు నిర్వాసితులపై పోలీస్ లాఠిచార్జీని తీవ్రంగా ఖండిస్తు సర్కార్ చర్యను దుయ్యబట్టారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ పేరిట ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కోంటుందని, న్యాయమైన పరిహారం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై లాఠిచార్జీ చేసి గాలిలోకి కాల్పులు జరిపి ప్రభుత్వం తన ఫాసిస్ట్ వైఖరిని చాటుకుందన్నారు. నిర్వాసితులకు 2013చట్టం మేరకు పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా ధిక్కరించి పోలీస్ నిర్భంధంతో భూసేకరణకు యత్నిస్తుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం భూనిర్వాసితుల పట్ల ఇదే రీతిలో వ్యవహారిస్తే గత ప్రభుత్వాలకు పట్టినే గతే పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తిరందాసు గోపి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎం.రాములు, వి.నారాయణరెడ్డి, రవినాయక్, బి.పద్మ, నర్సిరెడ్డి, పాలడుగు నాగార్జున, విప్లవకుమార్, ప్రభావతి, డి.సత్తయ్య, నర్సింహ, న్యూడెమోక్రసీ, పివైఎల్, పిడిఎస్‌యు నాయకులు సతీష్, నాగేష్, ఆయోధ్య, అఖిల్, చారి, వికాస్, సుధాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.