S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పదేళ్లలో అభివృద్ధ్దిలో తెలంగాణ నెంబర్‌వన్

మోత్కూరు, జూలై 25: పదేళ్ళలలో అభివృద్ధిలో ఇండియాలో తెలంగాణ రాష్ట్ర నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో 60 లక్షలతో నిర్మించిన సబ్ రిజిష్టర్ కార్యాలయ భవనాన్ని, 32 లక్షలతో నిర్మించిన స్ర్తిశక్తి భవనాన్ని ప్రారంభించారు. మండల పరిషత్ నూతన భవననిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ అభవృద్దే లక్ష్యయంగా పనిచేస్తున్నారని చెప్పారు. సాగు, తాగు నీటి కోసం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులు చేపడుతున్నారని తెలిపారు. నల్లగొండ జిల్లాలో చెట్లు తక్కువగా ఉన్నాయని అందువల్ల వర్షం కూడా తక్కువగా ఉందని ఆదిలాబాద్ జిల్లాలో చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే అక్కడ వర్షం ఎక్కువగా ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రెండేళ్ళలో నెరవేర్చారని తెలిపారు. 34 కోట్లతో చెట్ల పెంపకం చేపట్టినట్లు తెలిపారు. ఇంటింటికి నీళ్ళు ఇస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి కెసి ఆర్ మాత్రమే నని అన్నారు.
ఐదేళ్ల పనులు రెండేళ్ళలో పూర్తి చేశాం: మంత్రి జగదీష్‌రెడ్డి
ఐదు ఏండ్లలో చేయలేని పనులను తమప్రభుత్వం రెండు ఏండ్లలోనే పూర్తి చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పిఛన్లు, స్కూల్ పిల్లలకు సన్నబియ్యం, 6 కిలోల బియ్యం, మధ్యాహ్న భోజనం, ఆరోగ్యలక్ష్మి వంటి అనేక సంక్షే పథకాలు అమలు చేయడం జిరిగిందన్నారు. 60 ఏళ్ళ నష్టానికి గంగళాల మాదరిగా ఉన్న చెరువులు తాంబాలాలగా తయారై నీళ్ళు దొరకని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అందుకోసం చెరువులను పునరుద్దరించడం జరుగుతందన్నారు. నదులు ఉన్నాయని వాటి నుండి ఎంత దూరమైన తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారని గుర్తుచేశారు. సాగు ,తాగు నీళ్ళు రాకుండా కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.60 ఏండ్లు చేసిన ద్రోహం చాలక రోడ్లమీదికి వచ్చి గొడవలు చేస్తున్నరని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలందురూ భాగ స్వాములు కావాలని కోరారు.
హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే గాదరి
వానలు రావాలి.. కోతులు అడవులకు వాపస్ పోవాలి అనే ఉద్దేశ్యంతోనే హరిత హారం కార్యక్రమం చేపట్టడం జరిగిందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు.స్ర్తి శక్తి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సగటున ఒక వ్యక్తి సుమారు 420 మొక్కలు పెంచాల్సి ఉండగా కేవలం 18 మొక్కలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. చెట్లు తగ్గుతున్నాయి కాబట్టే వర్షపాతం కూడా తగ్గుతుందన్నారు. సకల జనుల సమ్మె మాదరిగా హరిత హారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. మోత్కూరులో ప్రధానమైన సమస్య పోస్టుమార్టం లేదని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. అతిథులను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలోఎంపిడిఓ వెంకటనర్సయ్య, ఎంపిపి ఓర్సులక్ష్మి,జెడ్ పిటిసి చింతల వరలక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, ఎంపిటిసిలు, ఆర్డీ ఓ భూపాల్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులతోపాటు తదితరులు పాల్గొన్నారు.