S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మొక్కల వివరాలను గూగుల్ యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలి

నిజామాబాద్, జూలై 25: జిల్లాలో తెలంగాణ హరితహారం కింద నాటిన మొక్కల వివరాలను ఫొటోలతో సహా పూర్తి వివరాలతో గూగుల్ యాప్ ద్వారా ఉపాధి హామీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె తన చాంబర్‌లో అధికారులతో హరితహారం కార్యక్రమంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగానే నిర్వహిస్తున్నారని, అయితే చేపట్టిన పనుల వివరాలను సమగ్ర ఆధారాలతో వెంటదివెంట అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ విషయాన్ని తాము ఇప్పటికే అధికారులను ఆదేశించామని, వాటిని ఎంతవరకు పాటించారనే విషయమై నివేదికలు సమర్పించాలన్నారు. అన్ని సంస్థలలోనూ మొక్కలను ఉపాధి హామీ కిందనే నాటడం జరిగిందని గుర్తు చేశారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతలను ఆయా సంస్థల స్వీపర్లకు అప్పగించినట్లయితే, వారికి వచ్చే నెలవారీ జీతంతో పాటు ఒక్కో మొక్క సంరక్షణ కింద 45పైసల చొప్పున అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఉపాధి హామీ కింద చెల్లించబడుతుందని తెలిపారు. అయితే సదరు సిబ్బంది తప్పనిసరిగా ఉపాధి హామీ కార్డు ఉండాలని, ఒకవేళ ఎవరికైనా లేనిపక్షంలో సంబంధిత అధికారులు వారికి కార్డులను సమకూర్చాలని సూచించారు. ఏదైనా సంస్థలో స్వీపర్ లేనట్లయితే గ్రామ సంస్థకు ఈ విషయాన్ని తెలియజేయాలని, వారు ఉపాధి హామీ జాబ్‌కార్డు కలిగిన వ్యక్తులను మొక్కల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఏర్పాటు చేస్తారని చెప్పారు. కాగా, హరితహారం కార్యక్రమం సందర్భంగా స్పెషలాఫీసర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించిన సమయంలో మొక్కల సంరక్షణ కోసం నియమించిన సెక్టోరియల్ అధికారుల నుండి పొందిన మైక్రోప్లాన్ వివరాలను వెంటదివెంట మెయిల్ చేసేలా పర్యవేక్షణ చేయాలని, అంతకుముందే పూర్తి వివరాలను స్వయంగా పరిశీలించి వాటిని ధ్రువకరించాలని, సమగ్ర నివేదికను అప్‌లోడ్ చేసేందుకు అందించాలని ఆదేశించారు. ఏదైనా గ్రామ పంచాయతీ పరిధిలో 40వేల మొక్కలు నాటడం పూర్తి కానట్లయితే సంబంధిత శాఖల అధికారులు సిబ్బందిని నియమించి వారికి మొక్కలు నాటించి లక్ష్యాన్ని పూర్తి చేసే బాధ్యతలు అప్పగించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ పరిధిలో 40వేల మొక్కలు నాటే కార్యం పూర్తి కావాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, అదనపు జె.సి రాజారాం, జిల్లా రెవెన్యూ అధికారి పద్మాకర్‌తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.