S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కెయు వైస్ చాన్సలర్‌గా ప్రొఫెసర్ సాయన్న

నక్కలగుట్ట, జూలై 25: కాకతీయ యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ ఆర్. సాయన్న సోమవారం కెయులో బాధ్యతలు స్వీకరించారు. ఈయన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కోరాట్‌పల్లి గ్రామానికి చెందినవాడు. దాదాపు 26సంవత్సరాల పాటు విద్యాబోధన చేసి 1989లో ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాడు. అంతకు పూర్వం ఆయన జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకునిగా పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ పరిపాలన పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బెనర్జీ ఆయనకు పుష్పగుచ్ఛం అందచేసి ఆహ్వానించారు. నూతన విసిగా విధుల్లో చేరిన ప్రొఫెసర్ సాయన్నను అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ సందర్భంగా విసి సాయన్న మాట్లాడుతూ తాను విసి స్థాయికి చేరేందుకు ముందుగా తన తల్లికి రుణపడి ఉన్నానని తెలిపారు. నిరక్షరాస్యులైన తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తన ఉన్నత విద్య చెప్పించారన్నారు. ఈ సందర్భంగా తన మీద నమ్మకంతో విసిగా నియమించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు.