S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చెట్లు.. ప్రగతికి మెట్లురూరల్ పరిధిలో 4 లక్షలు మొక్కలు నాటాం

పరకాల, జూలై 25: వృక్షాలతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా అన్నారు. సోమవారం పరకాల మండలం నడికూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరకాల పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హరతహారం కార్యక్రమంలో రూరల్ ఎస్పీ మొక్కలు నాటారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ వరంగల్ రూరల్ పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల మొక్కలు నాటామని చెప్పారు. ముఖ్యమంత్రి చేపట్టిన హరితహార యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. అయితే, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మన అందరిపైనా ఉందన్నారు. చెట్లతో కలిగే అనేక ప్రయోజనాలను ఆయన వివరించారు. ప్రతి విద్యార్థి జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాధించే వరకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. చెట్లు అంతరించి పోవడంతో వాతావరణం కాలుష్యమవుతోందన్నారు. దీనివల్ల సకాలంలో వర్షాలు కురియడం లేదన్నారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటితే గ్రామాలు పచ్చదనంతో నిండుకుంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి, అవి చెట్లుగా ఎదిగేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయాలని సూచించారు. పోలీస్ శాఖ బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి కొనసాగిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరకాల డిఎస్పీ సుదీంధ్ర, పరకాల ఎస్సై రవీందర్, పిఎస్సై నగేష్, స్థానిక సర్పంచ్ రావుల పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.