S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మొక్కలు నాటితేనే నిర్మాణ అనుమతి

హైదరాబాద్, జూలై 25: మహానగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట వేసేందుకు ఇప్పటికే ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇకపై మొక్కలు నాటి ఉన్న స్థలాల్లోనే నిర్మాణ అనుమతులివ్వాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు త్వరలోనే విడుదల చేయనున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 300 చదరపు గజాల విస్తీర్ణం, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్లలో విధిగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధన ఉందని తెలిపారు. అంతేగాక, ఇప్పటి వరకు 200 చదరపు గజాల పైనున్న స్థలాల్లో నిర్మించే వాటికే అక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు అమలు చేస్తుండగా, దాన్ని నిర్మాణ దారులు, ఇంటి యజమానులు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇపుడు తాజాగా వంద గజాల కన్నా ఎక్కువ విస్తీర్ణం కల్గిన స్థలాల్లో నిర్మించే వాటికి కూడా అక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు ఉంటేనే, వాటర్, కరెంటు కనెక్షన్లు వచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
మొక్కలు ‘డోర్ డెలివరీ’
ఈ నెల 11వ తేదీన జిహెచ్‌ఎంసి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అందుబాటులో ఉన్న మొక్కలను మాత్రమే పంపిణీ చేసిన జిహెచ్‌ఎంసి ఇకపై ప్రజల ఇష్టం మేరకు, వారికి కావల్సిన మొక్కలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అంతేగాక, ప్రజలు తమకు కావల్సిన మొక్కలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే నేరుగా వారి ఇంటికే డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్ పరిధిలో 84 నర్సరీల ద్వారా మూడున్నర కోట్ల మొక్కలు పెంచడం జరిగిందని తెలిపారు. ఇదివరకు కాకుండా ఇపుడు ప్రజలకు ఔషధ గుణాలు కల్గిన మొక్కలు, పూలు, పండ్లు ఇచ్చే మొక్కలను అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ తెలిపారు. నగరంలో స్థలాభావం ప్రజలు మొక్కలు నాటేందుకు ముందుకు రావటం లేదన్న విషయాన్ని గుర్తించి, చాలా తక్కువ సమయంలో రూఫ్‌టాప్‌లో కూడా మొక్కలను పెంపకాన్ని చేపట్టేందుకు వీలుగా మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 84లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటి వరకు 42లక్షల వరకు మొక్కలను నాటడం జరిగిందని వివరించారు. వీటిలో 7.5లక్షల మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. మొక్కల సంరక్షణకు ట్రీ గార్డులు అందజేయాలని పెద్ద ఎత్తున వినతులు వస్తున్నందున, ట్రీగార్డుల ఏర్పాటు అత్యంత వ్యయప్రయాసలతో కూడుకుందని, మూడు కోట్ల మొక్కలకు వీటిని ఏర్పాటు చేయటం సాధ్యం కాదన్నారు. అయితే ప్రస్తుత హరితహారం కార్యక్రమంలో ట్రీగార్డులను ఏర్పాటు చేసే ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదన్నారు. అత్యంత తక్కువ మొత్తానికి దొరికితే ట్రీగార్డుల వివరాలు వెబ్‌సైట్ ద్వారా ప్రకటించనున్నట్లు తెలిపారు.