S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘అధికారుల తీరుతో పని చేయలేక పోతున్నాం’

ఖైరతాబాద్, జూలై 25: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరుతో తాము సక్రమంగా పనులు చేయలేక పోతున్నామని జిహెచ్‌ఎంసి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం సెంట్రల్ జోన్ కార్యాలయంలో అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు. అసోసియేషన్ నేతలు దామోదర్ రెడ్డి, హనుమాన్ సాగర్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెబుతున్నా అధికారులు తాము పనిచేస్తున్న ప్రాంతాలను తనిఖీలు చేయాలని కోరినా రావడం లేదన్నారు. పనులు పూర్తిచేసిన తరువాత వచ్చి లోపాలు ఉన్నాయని ఇబ్బందుల పాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పూర్తిచేసిన పనులు బిల్లులు రాబట్టుకోవడానికి తిప్పలు పడాల్సి వస్తుందని చెప్పారు. ఔట్‌సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లు తమకు నచ్చిన వారికి పనులు ఇస్తున్నారని ఆరోపించారు. పనులు చేజిక్కించుకున్న ఇతరులను నానా కష్టాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. తాము క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిపార్ట్‌మెంట్‌లోని ఉన్నతాధికారులకు, మంత్రులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ జోక్యం చేసుకొని జిహెచ్‌ఎంసిలో జరుగుతున్న లోపాలను సరిచేయాలని కోరారు.