S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేడు విద్యాసంస్థల బంద్.. ఏబివిపి పిలుపు

హైదరాబాద్, జూలై 25 : విద్యారంగంలో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎబివిపి సోమవారం విద్యాసంస్థల (కెజి టు పిజి) బంద్‌కు పిలుపు ఇచ్చింది. ఈ మేరకు ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప పేరుతో ఒక ప్రకటన జారీ అయింది. ప్రైవేట్, కార్పోరేట్ కాలేజీల ఫీజుల దోపిడీని అరికట్టి, ఫిజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి, దోషులను శిక్షించాలని, ఇంజనీరింగ్ బి క్యాటగిరీ సీట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుల చేయాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో కాస్మోటిక్స్ చార్జీలను బాలురకు 300 రూపాయలుగా, బాలికలకు 500 రూపాయల వరకు పెంచాలని, పెంచిన ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులకు అనుగుణంగా ఫీజు రీఇంబర్స్‌మెంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.