S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించిన జలమండలి

హైదరాబాద్, జూలై 25: గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రజలకు మేరుగైన సేవలు అందించేందుకు జలలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. వినియోగదారులకు సక్రమమైన నీటి సరఫరా, డ్రైనేజీ, లోవాటర్ సప్లై వంటి సమస్యలతో పాటు సకాలంలో నీటి బిల్లుల జారీ, అక్రమ నీటి కనెక్షన్లను గుర్తించడం, కమర్షియల్ నీటి కనెక్షన్ల సంఖ్యను పెంచేందుకు జలమండలి వినూత్న తరహాలో నూతర నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే జలమండలిలో పనిచేస్తున్న డైరెక్టర్, సిజిఎం స్థాయి అధికారుల పర్యవేక్షణలో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జలమండలి ఎండి ఎం.దానకిషోర్ ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వాటర్ సప్లై, సివరేజ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు, వర్క్ ఇన్స్‌పెక్టర్లులతో సమావేశమయ్యారు. సమావేశంలో కార్మికులకు కలుగుతున్న ఇబ్బందులు తెలుసుకున్న ఎండి.. బోర్డు మనుగడకు ప్రతి కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. సమావేశం అనంతరం ఎండి కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఇడి సత్యనారాయణ, డైరెక్టర్లు జి.రామేశ్వరరావు, డాక్టర్ పి.సత్యనారాయణ, ఎల్లస్వామి, రవిందర్‌రెడ్డిలతో పాటు సిజిఎం, జిఎంలు పాల్గొన్నారు. సిబ్బంది, అధికారులు సమన్వయంలో పనిచేసి జలమండలి ఆదాయాన్ని గణనీయంగా పెంచాలన్నారు.