S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఓడరేవు నిర్మాణం తథ్యం

మచిలీపట్నం, జూలై 25: జిల్లా ప్రజల చిరకాల వాంఛ బందరు ఓడరేవు నిర్మాణం తథ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. త్వరలోనే ఓడరేవు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సోమవారం విజయవాడలోని జలవనరుల శాఖ సమావేశ మందిరంలో ఇన్‌ఛార్జ్ మంత్రి పుల్లారావు అధ్యక్షతన బందరు అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. గత రెండేళ్ళుగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు తీరును సమీక్షించారు. ప్రభుత్వపరంగా ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా బందరు ఓడరేవు, పరిశ్రమల స్థాపనకు ఇటీవల జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ జీవోపై చర్చ జరిగింది. ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ పట్ల రైతుల్లో సంతృప్తి నెలకొందని, చాలామంది రైతులు భూములు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర ఇన్‌ఛార్జ్ మంత్రి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే భూసమీకరణ ద్వారా రైతుల నుండి భూములు సమీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈవిషయంలో రైతుల్ని సంసిద్ధుల్ని చేయాలని పుల్లారావు సూచించారు. అలాగే మచిలీపట్నం పురపాలక సంఘం, మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సమావేశంలో జెడ్పీటిసి లంకే నారాయణప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ కాశీవిశ్వనాథం, టిడిపి పట్టణ, మండల అధ్యక్షులు ఇలియాస్ పాషా, తలారి సోమశేఖర్, సమన్వయ కమిటీ సభ్యులు గొర్రిపాటి గోపిచంద్, బూరగడ్డ రమేష్ నాయుడు, మరకాని పరబ్రహ్మం, బోలెం హరిబాబు, కుర్రా నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.