S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏ ఒక్క రైతు ల్యాండ్ పూలింగ్‌కు తలొగ్గద్దు

మచిలీపట్నం, జూలై 25: రాజధానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ ప్రాంత రైతులతో రెండు మూడు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడి రైతులను చైతన్యవంతం చేస్తామని ప్రభుత్వ మాజీ విప్, వైఎస్‌ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో భూ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధాని ప్రాంత రైతులను మోసగించిన ప్రభుత్వం మళ్ళీ బందరు ఓడరేవు, పరిశ్రమల పేరుతో ఈ ప్రాంత రైతుల భూములను దోచుకునేందుకు కుట్ర పన్నుతోందన్నారు. సిఆర్‌డిఎ తరహా ప్యాకేజీ అంటూ అరచేతిలో వైకుంఠం చూపించే విధంగా పాలకపక్షం మాట్లాడుతూ రైతులను నమ్మబలుకుతోందన్నారు. దీన్ని ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము తీవ్రంగా ఎదుర్కొంటామన్నారు. రాజధానికి ఎంతో మంది రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ప్యాకేజీ అమలు కాలేదని ఫలితంగా ఆ ప్రాంత రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారు పడుతున్న ఇబ్బందులను ఈ ప్రాంత రైతులకు కళ్ళకు కట్టినట్టు చూపించేందుకు ఈ నెల 30వతేదీ లోపు బందరులో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 9.3 ఫారం మీద ఏ ఒక్క రైతు సంతకం చేయవద్దని కోరారు. సంతకం చేసిన మరుక్షణం నుండి భూమి మీద హక్కు కోల్పోవల్సి వస్తుందన్నారు. పూలింగ్‌ను వ్యతిరేకిస్తూ 9.2 ఫారం మీద మాత్రమే సంతకం చేయాలన్నారు. మనకెందుకులే అని ఏ ఫారం మీద సంతకం చేయకుండా ఉంటే పూలింగ్‌కు అంగీకారం చెప్పినట్టేనన్నారు. బందరు ఓడరేవు నిర్మాణానికి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన రోజున విజయనగరం జిల్లా బావనపాడు ఓడరేవు నిర్మాణానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. అక్కడ కేవలం ఓడరేవు నిర్మాణానికి మాత్రమే భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. కానీ బందరులో ఓడరేవుతోపాటు పరిశ్రమల స్థాపనకు నోటిఫికేషన్ ఇవ్వడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన మంత్రులు, వారి బంధువులు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కారు చౌకగా భూములు కొనుగోలు చేశారని, వాటి ధరలను పెంచుకునేందుకే పరిశ్రమల స్థాపన అంటూ రైతుల భూములు బలవంతంగా తీసుకునేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. రైతుల పక్షాన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ఏ ఒక్క రైతు ప్రభుత్వానికి తలొగ్గి ల్యాండ్ పూలింగ్‌కు వెళ్ళవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో భూ పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు కొడాలి శర్మ, షేక్ సలార్ దాదా, యద్దనపూడి సోని, లింగం ఫిలిప్, రాము తదితరులు పాల్గొన్నారు.
శివారు నియోజకవర్గంపై
ప్రత్యేక శ్రద్ధ చూపండి
* మంత్రులను కోరిన నాయకులు
కైకలూరు, జూలై 25: జిల్లాకు శివారు ప్రాంతం వెనుకబడిన నియోజకవర్గమైన కైకలూరుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా స్థానిక నాయకులు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పగంటి వెంకట్రామయ్య తదితర నాయకులు మంత్రులను కోరారు. సోమవారం ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన నియోజకవర్గాల సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆరోగ్యశాఖా మంత్రి డా. కామినేని శ్రీనివాస్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా పార్టీ పరిశీలకులు పాలకొల్లు ఎమ్మెల్యే డా. నిమ్మల రామానాయుడు పాల్గొని సమీక్ష నిర్వహించారు.