S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వన మహోత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

జగ్గయ్యపేట రూరల్, జూలై 25: రాష్ట్ర ఫ్రభుత్వం ఈ నెల 29న వన మహోత్సవంలో భాగంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా తీసుకుందని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయి పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కోరారు. సోమవారం చిల్లకల్లు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గ స్థాయి సమావేశం వత్సవాయి ఎండిఒ జయచంద్ర అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, పరిశ్రమల నుండి కాలుష్యం వెలువడటం జరుగుతుందని, దీన్ని నివారించేందుకు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. గ్రామగ్రామాన ప్రతి ఇంటిలో మొక్కలు నాటాలన్నారు. నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు ఎండిఒలు సుశీల, జి ప్రభాకరరావు, వై శ్రీనివాసరెడ్డి, ఇన్‌చార్జి తహశీల్దార్ చిట్టిబాబు, ఎంపిపి తాళ్లూరి పార్వతి, సిడిపిఒ గ్లోరీ, ఎపిఒ జనార్థన్, వత్సవాయి జడ్‌పిటిసి ఎ కమల, చిల్లకల్లు సర్పంచ్ సంపతి విజేత, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడిన జనార్ధనరావు
తోట్లవల్లూరు,జూలై 25: ప్రజా సమస్యలపై పోరాడి ప్రాణాలు అర్పించిన మహానీయుడు సూరపనేని జనార్ధనరావురని విప్లవ రచయిత సంఘం(విరసం) అధ్యక్షుడు వరవరరావు పేర్కొన్నారు. మండలంలోని గరికపర్రులో విప్లవ వీరుడు సూరపనేని జనార్ధనరావు 41వ సంస్మరణ సభ సోమవారం సాయంత్రం జరిగింది. జనార్ధనరావు విగ్రహానికి వరవరరావు.సమతాపార్టీ అధ్యక్షుడు వివి కృష్ణరావు, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమ కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, విరసం కార్యదర్శి వరలక్ష్మీ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాయికల్యాణ మండపంలో వై వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటైన సభలో వరవరరావు ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ వరంగల్ కళాశాలలో చదువుతున్న సమయంలో విద్యార్థుల్లో చైతన్యం నింపి ఉద్యమాలకు సాయుధ పోరాటం చేశారని తెలిపారు. విద్యార్థి ఉద్యమాలను నిర్మించాడని, ర్యాగింగ్ భూతానికి వ్యతిరేకంగా ఉద్యమించాడని వివరించారు. అంతేకాకుండా కార్మికులు, రైతుకూలీ సమస్యలపై సాయుధ పోరాటం నడిపి పోలీసుల చేతుల్లో మరణించాడని, చిన్నవయస్సులోనే అమరుడయిన జనార్ధనరావు ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళాలని వరవరరావు అన్నారు. ఇంకా పలువురు ప్రముఖులు ఆయన ఆశయాల గురించి ప్రసంగించారు. తొలుత డప్పు రమేష్ కళాకారుల బృందం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జనార్ధనరావుతో పాటు మరణించిన మురళీమోహన్‌రెడి, సుధకార్ , ఆనందరావులకు కూడా నివాళులర్పించారు. సూరపనేని జనార్ధనరావు చారిటబుల్ ట్రస్టు కన్వీనర్ ఎస్ పూర్ణమోహన్‌రావుతదితరులు పాల్గొన్నారు.