S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కౌంట్‌డౌన్-18

విజయవాడ, జూలై 25: కృష్ణా పుష్కరాలకు అత్యవసర చికిత్స విధానంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిపుణులైన వైద్యులతో కూడిన 12 రాపిడ్ ఎమర్జెన్సీ మెడికల్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్‌టిఆర్ విశ్వవిద్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ పుష్కరాల సన్నద్ధతపై చేపట్టిన కార్యక్రమాలను వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ బృందాలలోని వైద్యులు, ఇతర సిబ్బందికి హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఏదైనా సంఘటన జరిగినపుడు అత్యవసర చికిత్స నిమిత్తం రోగులను అంబులెన్సుల ద్వారా తరలించేందుకు ప్రత్యేక డెడికెటెడ్ దారులను ప్రతి ఘాట్ నుంచి ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ బాబు.ఎను మంత్రి కోరారు. దుర్గాఘాట్ వద్ద రెండు బోట్ అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా పోలీసు శాఖ వినియోగంలో ఉన్న మోటారు సైకిల్ అంబులెన్సు సేవలను పుష్కరాల సమయంలో తమ శాఖకు అప్పగించాలని పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను మంత్రి ఫోన్‌లో కోరారు. పుష్కరనగర్‌లలో ఆహారం పంపిణీ సందర్భంగా నాణ్యత ప్రమాణాలు మదింపు చేసేందుకు తమ శాఖకు చెందిన ఆహార భద్రత బృందాలను వినియోగించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. యాత్రికులకు అవసరమైన వైద్య శిబిరం అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను 3 షిప్టులలో నియమించాలని వైద్యం అవసరమైన పక్షంలో వైద్య శిబిరంలోనే పూర్తిస్థాయి చికిత్స అందించాలన్నారు. ఉన్నతస్థాయి పరీక్షలో చికిత్స అవసరమైనప్పుడు సమీపంలో ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలన్నారు. అన్ని స్థాయిలలోను బాధ్యత గల అధికార్లను బాధ్యులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేయ్యాలని అధికారులను ఆదేశించారు. ఎ-ప్లస్ స్థాయి, ఎ-స్థాయి ఘాట్లలో ప్రాణరక్షణ మందులు వైద్య పరికరాలు ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పుష్కర యాత్రికుల ఉపవాస నియమంతో ఎక్కువగా ఉంటారని దీనికి తోడు ప్రయాణ బడలిక వల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర నిల్వల స్థాయి పడిపోతుందన్నారు. ఇందువల్ల ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు రక్తపరీక్ష, మధుమేహ పరీక్షలు ఉచితంగా చేయాలని ఇందుకు అవసరమైన మందులు సిద్ధం చేసుకోవాలన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆ శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు పుష్కర సేవలు అందించే అధికారులు, సిబ్బంది అందరూ నీలిరంగు జాకెట్, తెలుపు రంగు స్కాప్‌లతో కూడిన ప్రత్యేక డ్రస్ కోడ్‌ను అనుసరించాలని మంత్రి సూచించారు.
వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ పుష్కర సేవలపై నిర్ణయం తీసుకునే రాష్టస్థ్రాయి అధికార్లలందరూ ఘాట్లను, పుష్కర్‌నగర్‌లను ముందుగా సందర్శించి, స్థానిక అవసరాలను గుర్తించాలన్నారు. ఘాట్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు వాటికి ఘాట్లకు మధ్య దూరం వంటి అంశాలపై ఖచ్చితమైన అవగాహనకు రావాలన్నారు. కేవలం ఏర్పాట్లు చేయడంతో బాధ్యత తీరపోదని, వాటిని అమలు చేసే వ్యూహాలు, ఆచరణ ముఖ్యమని ఉన్నతస్థాయి అధికార్లతో గుర్తించాలన్నారు. ఎటువంటి సంఘటన జరిగినా వైద్య శిబిరంలో వైద్యం అందించాలని లేనిపక్షంలో సంఘటానస్థలి నుంచి 16 నిముషాల వ్యవధిలో రిఫర్ ఆసుపత్రికి రోగిని తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. గత పుష్కరాల్లో ఘాట్ల సమీపంలో ప్రసవాలు లేకుండా అయిన సందర్భాలున్నాయన్నారు. ఇందుకు అన్ని విధాలా వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. పుష్కరాలకు అవసరమైన వైద్య పరికరాలు, మందులు కొనుగోలుకు సంబంధించి తలపట్టిన సమావేశాలు నిర్వహించి, తీసుకున్న చర్యలు నిర్ణయించాలని ఆమె ఆదేశించారు. ఎ-ప్లస్ ఘాట్‌ల వద్ద మూడు షిప్టులలోనూ వైద్యధికారితో కూడి బృందాలు పని చేస్తాయన్నారు. బి కేటగిరి ఘాట్లల వద్ద రెండు వైద్య బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ పుష్కరనగర్‌లలో కూడా ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. ఆహార పంపిణీ ఉన్న దృష్ట్యా సంబంధిత అంశాలకు చెందిన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇందువల్ల వైద్య బృందాలు ఏర్పాటు అవసరమన్నారు. అదే విధంగా ఆర్‌టిసి బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లుల్లో వైద్య బృందాలు ఏర్పాటును కలెక్టర్ కోరారు. కృష్ణా పుష్కరాలలో పనిచేసే సిబ్బందికి 600 స్కూళ్లు, 78 కళాశాలలో వసతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా పుష్కరాలలో భద్రతకు సిసి కెమెరాలు నగరంలో ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా విజయవాడ నగర ప్రజలు కూడా కృష్ణా పుష్కరాలను తమ ఇంటి పండుగగా భావించి వచ్చే భక్తులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ మాట్లాడుతూ పుష్కర ఘాట్‌లకు దగ్గరలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులను గుర్తించడం జరిగిందన్నారు. ఘాట్ స్థాయి నుండి ఉన్నతస్థాయి చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా బాధ్యులైన అధికార్లను నియమిస్తున్నామన్నారు. ప్రతి పుష్కర ఘాట్‌లో ఏర్పాటు చేసే వైద్య శిబిరాలకు అత్యవసర మందులతో కూడిన కిట్‌లు ఇస్తున్నామన్నారు. కృష్ణాజిల్లా అధికారులు కోరిన 130 రకాలైన మందులలో 82 రకాలు వైద్య ఆరోగ్యశాఖ రేట్ కాంట్రాక్ట్‌లో ఉన్నాయన్నారు. మిగిలిన స్థానికంగా కొనుగోలు చేసుకొనేందుకు అవకాశం ఉందన్నారు. ఆగస్టు 4 నాటికి అన్ని మందులు స్థానిక వైద్య ఆరోగ్యశాఖ అధికారికి అందజేస్తామన్నారు. కృష్ణా పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉద్యోగులు వారికి అందుబాటులో ఉండాలని ఎప్పటికప్పుడూ అధికార్లతో సమన్వయం చేసుకుని తమస్థాయిలోనే సమస్యలను పరిష్కారం అయ్యేట్లు చూడాలని లేకపోతే పై అధికార్ల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశంలో మంత్రి డా. కామినేని శ్రీనివాస్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, కలెక్టర్ బాబు.ఎ, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ కృష్ణా పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్, శామ్యూల్ ఆనంద్‌కుమార్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ రాష్టస్థ్రాయి ఉన్నతాధికార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.